Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలు : కాంగ్రెస్ రహిత ఉత్తరాది...? బీజేపీ రహిత దక్షిణాది?

By:  Tupaki Desk   |   3 Dec 2023 4:29 AM GMT
అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలు : కాంగ్రెస్ రహిత ఉత్తరాది...? బీజేపీ రహిత దక్షిణాది?
X


  • కాంగ్రెస్ రహిత ఉత్తరాది...? బీజేపీ రహిత దక్షిణాది?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనంతరం... బీజేపీ దక్షిణాదిలో దారులు మూసుకుపోయాయనే కామెంట్లు వినిపించాయి. దానికి మరోసారి బలం చేకూరుస్తూ తెలంగాణలో బీజేపీ మూడో స్థానానికి పడిపోయేట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. తెలంగాణ, రాజస్తాన్ లో మాత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ రహిత ఉత్తరాది, బీజేపీ రహిత దక్షిణాది అనే చర్చ తెరపైకి వచ్చింది.

  • మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్న 4 నియోజకవర్గాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటూ తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ... మిగిలిన రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ తో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్ లోనూ షాకులు తప్పడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.

  • మూడు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ ఫలితాలకు షాకిచ్చిన బీజేపీ!

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుండగా... మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు షాకిస్తూ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు గానూ బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... కాంగ్రెస్ 71 నియోజకవర్గాల్లో లీడ్ లో ఉంది. ఇదే సమయంలో రాజస్థాన్ లో బీజేపీ 107 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 76 స్థానాల్లోనూ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో... ఛతీస్ గఢ్ లో బీజేపీ 52, కాంగ్రెస్ 37 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.

  • అప్పుడే అక్కడ స్వీట్లు పంచుతున్న బీజేపీ... సెంచరీ దాటినట్లే...!

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సాంప్రదాయం కొనసాగుతుంది. ఇందులో భాగంగా... బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి సెంచరీ మార్క్‌ ను దాటేసింది. ఈ సమయంలో కాంగ్రెస్ 78 సీట్లతో వెనుకబడి ఉంది. రాజస్థాన్ అసెంబ్లీలో 199 సీట్లకు పోలింగ్‌ జరగ్గా అధికార కాంగ్రెస్‌ పార్టీ వెనుకంజలో పడింది.

ఈ సమయంలో విజయం తమదేనని.. ప్రస్తుత మెజార్టీ కొనసాగుతుందని.. ఇప్పటికే లడ్డూలను కూడా పంపిణీ చేశామని బీజేపీ నేత సీపీ జోషి వెల్లడించారు. ఇందులో భాగంగా సుమారు 135 సీట్లు సాధిస్తామనే ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  • 10: 15 ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తున్న రాజస్థాన్ ఎగ్జాట్ పోల్!

దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో... ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఈ క్రమంలో 11-12 గంటలకల్లా ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో... మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ లో బీజేపీ నెగ్గవచ్చని, ఛత్తీస్‌ గఢ్, తెలంగాణల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందనే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వాస్తవమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్‌ ప్రజల ఆనవాయితీ కాగా.. ఈసారీ అదే కొనసాగుతుందని బీజేపీ చెబుతుండగా.. సంప్రదాయాన్ని మారుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే... సాంప్రదాయం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్‌ లో బీజేపీ 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ 75 చోట్ల ముందంజలో ఉంది.

మధ్యప్రదేశ్‌ లోని 230 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ మార్కు 116 కాగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ లో బీజేపీ 126, కాంగ్రెస్‌ 44 చోట్ల ఆధిక్యంలో ఉండగా... రాజస్థాన్‌ లో బీజేపీ 83, కాంగ్రెస్‌ 69 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ ది అని చెప్పిన ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ - కమలం మధ్య గట్టి పోటీ నెలకొంది. అదేవిధంగా రాజస్థాన్‌ లోనూ బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తుంది. ఇందులో భాగంగా... ఛత్తీస్‌ గఢ్‌ లో బీజేపీ 31, కాంగ్రెస్‌ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు పార్టీలకూ హోరా హోరీ పోరు సాగుతుంది.