Begin typing your search above and press return to search.

ఎన్నికల షెడ్యూల్ అప్పుడే... ఈసారి ఎన్ని విడతల్లో అంటే...?

ఇందులో భాగంగా... మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 9:32 AM GMT
ఎన్నికల షెడ్యూల్ అప్పుడే... ఈసారి  ఎన్ని విడతల్లో అంటే...?
X

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ & కో భావిస్తుండగా.. ఇకపై బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని, ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో లోక్‌ సభ ఎన్నికలకు షెడ్యూల్ మార్చి రెండోవారంలో వెలువడనుందని తెలుస్తుంది.

అవును... సార్వత్రిక ఎన్నికల కోసం ఒకపక్క రాజకీయ పార్టీలు అన్నీ అన్నిరకాలుగానూ సిద్ధమవుతుండగా... మరోపక్క ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు.. త్వరలోనే షెడ్యూల్‌ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుందని.. ఈ క్రమంలోనే మార్చి 12, 13 తేదీల్లో జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ సమయంలో... అన్ని డివిజన్లలోనూ ఎన్నికల సంఘం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా ఏర్పాటు చేయనుందని... అదేవిధంగా, ఈసారి దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో... ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని విడతలను విభజించే అవకాశం ఉందని సమాచారం.

మార్చి 3న మోడీ & కో కీలక భేటీ!:

మార్చి 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని కథనాలొస్తున్న నేపథ్యంలో... అందుకు సరిగ్గా 10రోజుల ముందు అన్నట్లుగా మార్చి 3న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుందని తెలుస్తుంది. ఇలా సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.