ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ అంటున్న వైసీపీ ఎంపీ...!
ఏపీలో ఎన్నికలు మార్చిలో జరుగుతాయా అంటే వైసీపీ ఎంపీ మాటలను బట్టి చూస్తే జరుగుతాయని భావించాలి. లేకపోతే ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన ఎందుకు అంటారు.
By: Tupaki Desk | 12 Dec 2023 3:50 AM GMTఏపీలో ఎన్నికలు మార్చిలో జరుగుతాయా అంటే వైసీపీ ఎంపీ మాటలను బట్టి చూస్తే జరుగుతాయని భావించాలి. లేకపోతే ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన ఎందుకు అంటారు. ఇంతకీ అలా అన్న ఎంపీ ఎవరో కాదు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది అని ఆయన అన్నారు అందుకే వైసీపీ మార్పుచేర్పులు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి రాజీనామాను పెద్దగా చూడాల్సిన అవసరం అయితే లేదు అని ఆయన అన్నారు. ఆయన మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు.
అయితే పార్టీ పరంగా చూస్తే ఒక బీసీకి అవకాశం ఇవ్వాలని ఉందని అందుకే సామాజిక సమీకరణల నేపధ్యంలోనే ఆళ్లను త్యాగం చేయాల్సి వచ్చిందని ఆయన విశ్లేషించారు. ఇక ఆళ్లకు ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అని అయోధ్య రామిరెడ్డి అనడం విశేషం.
అయినా ఆళ్ళ తన ధర్మం తాను చేశారు అని ఆయన రాజీనమా పూర్తిగా వ్యక్తిగతం అని అన్నారు. ఆళ్లకు వైసీపీ ఎలాంటి అన్యాయం చేయలేదని అన్నారు. ఇక పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేసి పూర్తి సంతృప్తితోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారని కూడా అయోధ్య రామిరెడ్డి చెప్పడం గమనార్హం.
అయితే ఆర్కేని జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అంటూ ఆయన మరో కొత్త విషయమూ చెప్పారు. ఆళ్ళ ఎక్కడ టికెట్ కావాలంటే అక్కడ ఇచ్చేందుకు జగన్ రెడీగా ఉంటారని అన్నారు. ఆళ్ళ కూడా తన ప్రాంతాన్ని తన ప్రజలను తన రాజకీయాలను వదులుకోలేరని అన్నారు.
ఇక ఆళ్ళ పార్టీ కోసం ఎంతో పనిచేశారని, అందువల్ల కార్యకర్తల మనోభావాలను హై కమాండ్ దృష్టికి తీసుకుని వెళ్తామని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే మంగళగిరిలో మరోసారి వైసీపీ భారీ ఆధిక్యతతో గెలుస్తుంది అని అయోధ్య రామిరెడ్డి జోస్యం చెప్పారు