Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కార్ త్వరలో వారికి బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఇందులో భాగంగా... విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 4:03 AM GMT
తెలంగాణ సర్కార్  త్వరలో వారికి బ్యాడ్  న్యూస్  చెప్పబోతుందా?
X

'కొత్త వాహనం ఏ కంపెనీది కోనుగోలు చేస్తారో మీ ఇష్టం.. విద్యుత్ తో నడిచే వాహనాన్ని మాత్రం కొనండి.. భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించండి' అంటూ ఇటీవల చెప్పిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ "ఈవీ నూతన పాలసీ"ని రుపొందించామని చెబుతూ.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 18 నుంచి నుంచి ప్రారంభమైన ఈ మినహాయింపు.. 2026 డిసెంబర్ 31 వరకూ రాష్ట్ర పరిధిలో జరిగే అన్ని విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్ కూ వర్తిస్తుందని మంత్రి అన్నారు.

ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలని.. అయితే రెండో బండి ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారికి ఆ 2 శాతం అదనపు పన్ను మినహాయిస్తామని చెప్పారు. ఇదే సమయంలో త్వరలో ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారనే చర్చ మొదలైంది.

అవును... ఇటీవల ఈవీ వాహనాల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన టీ సర్కార్.. త్వరలో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల విషయంలో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతోందని అంటున్నారు. ఇందులో భాగంగా... పెట్రోల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయంతో పాటు పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అధ్యయనం చేశారని.. ఈ మేరకు అక్కడి రోడ్ ట్యాక్స్ లెక్కలు, తెలంగాణలో వాహనాలతో వచ్చే ఆదాయంపై ఓ నివేదిక రూపొందించారని.. దీన్ని త్వరలో మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించనున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వాహన రిజిస్ట్రేషన్ లో కీలకమైన రోడ్ ట్యాక్స్ ను కొంత మేర పెంచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు లక్ష రూపాయల లోపు ఉన్న టూ వీలర్ వెహిహల్స్, రూ.10 లక్షలపైన ఉన్న కార్లకు రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.