కరెంటు చార్జీలు ఎందుకు పెంచారు?: మంత్రిపై బాబు ఆగ్రహం
విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటి? ఎందుకు పెంచారు? అంటూ.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
By: Tupaki Desk | 6 Feb 2025 11:26 AM GMTఏపీలో విద్యుత్ చార్జీలు పెరగడం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. గత రెండు నెలలుగా ఈ సమస్య ఉంది. అయితే.. ఈవిషయం తనకు చెప్పకుండా ఎందుకు చేశారంటూ.. సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిలదీశారని తెలిసింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వివరణ కోరారు. విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటి? ఎందుకు పెంచారు? అంటూ.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని.. అలాంటిది విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటని ఆయన నిలదీశారు. దీనిపై మంత్రి సమాధానం ఇస్తూ.. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్(ఏపీఈఆర్ సీ) ఆదేశా ల మేరకు డిస్కమ్‌లు పెంచాయని.. అది కూడా 300 యూనిట్లుపైబడిన వారికే పెరిగిందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంగా చెప్పుకొచ్చారు.
అయినప్పటికీ.. ఎవరికీ విద్యుత్ చార్జీలను పెంచొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 300 యూనిట్లయి నా.. ఇంకెన్ని యూనిట్లయినా.. ధరలు పెంచేందుకు అవకాశం లేదన్నారు. ఒకవేళ ఇప్పటికే పెంచి ఉంటే.. వచ్చే నెల నుంచి రద్దు చేయాలని కూడా పేర్కొన్నారు. ఇదిలావుంటే.. విద్యుత్ సంస్థలు తమ భారాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాని.. అయితే.. ఈ క్రమంలో సూర్యఘర్, కుసుమ్(రైతుల కు సంబంధించింది) పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.
మార్పు తక్షణం అమలులోకి రావాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. అసలు ముఖ్యమం త్రికి కూడా తెలియకుండానే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడం ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరిగినా.. ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ, నేరుగానే మంత్రి నిర్ణయం తీసుకోవడం పై కేబినెట్ భేటీలో సీఎం సీరియస్ అయ్య పరిస్థితిని తీసుకువచ్చింది.