Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నిక‌ల్లో 'మ‌స్క్‌' చిచ్చు!

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ట్రంప్ కీల‌క మ‌ద్ద‌తు దారు. ప్ర‌పంచ కుబేరుడుగా పేరు తెచ్చుకున్న ట్విట్ట‌ర్ అధినే త.. ఎలాన్ మ‌స్క్‌మ‌రో కీల‌క వివాదానికి తెర‌దీస్తూ.. ఎన్నిక‌ల్లో చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 11:30 AM GMT
అమెరికా ఎన్నిక‌ల్లో మ‌స్క్‌ చిచ్చు!
X

అమెరికాలో అధ్య‌క్షుడి ఎన్నిక‌లు మరో మూడు వారాల్లో జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌రు 5న నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక‌ల‌కు అగ్ర‌రాజ్యం రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారు.. వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్ష రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి.. మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న‌వారు.. రోజుకొక డిమాండ్ తో ఎన్నిక‌ల‌ను వేడెక్కిస్తున్నారు.

గ‌త నెల‌లో డెమొక్రాటిక్ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షురాలు క‌మ‌ల హ్యారిస్ ఆరోగ్యంపై ట్రంప్ మ‌ద్ద‌తు దారులు సందేహాలు వ్య‌క్తం చేశారు. ఆమె మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని.. బాంబు పేల్చారు. ఈ స‌మ‌యంలోనే ఆమె కుటుంబ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా బ‌య‌ట పెట్టారు. దీంతో తీవ్రంగా హ‌ర్ట‌యిన హ్యారిస్‌.. అప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని.. త‌న బాడీ ఫిట్‌గానే ఉంద‌ని చెప్పాల్సి వ‌చ్చిం ది. దీనికి సంబంధించి ఆమె వైద్యులు ఇచ్చిన స‌ర్టిఫికెట్ల‌ను కూడా అప్ లోడ్ చేశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ట్రంప్ కీల‌క మ‌ద్ద‌తు దారు. ప్ర‌పంచ కుబేరుడుగా పేరు తెచ్చుకున్న ట్విట్ట‌ర్ అధినే త.. ఎలాన్ మ‌స్క్‌మ‌రో కీల‌క వివాదానికి తెర‌దీస్తూ.. ఎన్నిక‌ల్లో చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆన్ లైన్‌, ఆఫ్‌లైన్ వేదిక‌ల్లో ఆయ‌న ఎన్నిక‌ల కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధా నంలో నిర్వ‌హించాల‌న్న‌ది మ‌స్క్ చేస్తున్న డిమాండ్‌. దీనికి ఆయ‌న భారీగానే మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నా రు. ''ఇంట‌లెక్య్చువ‌ల్స్ ప్లీజ్ రెస్పాండ్‌'' అంటూ.. మేధావుల‌ను క‌దిలిస్తున్నారు.

ఈవీఎంల ద్వారా.. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. వాటిని మార్చేసే అవ‌కాశం ఉంద‌ని మ‌స్క్ హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్టిఫిసియ‌ల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని... దీనివ‌ల్ల ఎక్క‌డ నుంచైనా.. ఈవీఎం ల‌ను మేనేజ్ చేయొచ్చ‌య‌ని మ‌స్క్ చెబుతున్న మాట‌. కాబ‌ట్టి ట్రంప్ ను ఓడించేందుకు.. కుట్ర చేసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో బ్యాలెట్ ద్వారా నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అమెరికా ఫెడ‌ర‌ల్‌కు ఆయ‌న విన్న‌విస్తున్నారు. అంతేకాదు.. బ్యాలెట్ అయితేనే ఓటేస్తామ‌ని యువ‌త‌, మేధావులు క‌దిలిరావాల‌ని కూడా పిలుపునిస్తున్నారు. మ‌రి ఈ ఎలాన్ ఉద్య‌మం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.