హ్యాష్ ట్యాగ్స్ పై మస్క్ 'అగ్లీ' అభిప్రాయానికి రియాక్షన్స్ ఇవే!
అవును... హ్యాష్ ట్యాగ్ లు ఇప్పటికీ సంబంధితంగా ఉన్నాయా అనే గ్రోక్ ఏఐ చాట్ బాట్ ప్రత్యుత్తరానికి ప్రతిస్పందిస్తూ... హ్యాష్ ట్యాగ్ లు అవసరం లేదని మస్ట్ స్పష్టంగా, స్ట్రాంగ్ గా చెప్పారు!
By: Tupaki Desk | 19 Dec 2024 5:11 PM GMTమైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ లో పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ లు అవసరం లేదని స్పేస్ ఎక్స్ అధినేత, 'ఎక్స్ ' సీఈఓ ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. దీంతో... సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మస్క్ అలా ఎందుకు ప్రకటించారనేది ఆసక్తిగా మారింది.
అవును... హ్యాష్ ట్యాగ్ లు ఇప్పటికీ సంబంధితంగా ఉన్నాయా అనే గ్రోక్ ఏఐ చాట్ బాట్ ప్రత్యుత్తరానికి ప్రతిస్పందిస్తూ... హ్యాష్ ట్యాగ్ లు అవసరం లేదని మస్ట్ స్పష్టంగా, స్ట్రాంగ్ గా చెప్పారు! ఇందులో భాగంగా... "దయచేసి హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించడం ఆపేయండి.. సిస్టమ్ కి ఇకపై ఆ అవసరం లేదు.. అవి అసహ్యంగా కనిపిస్తాయి" అని అన్నారు.
దీంతో... ఈ స్టేట్ మెంట్ సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఎలాన్ మస్క్ చేసిన ఈ పోస్టుపై స్పందిస్తూ నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నెటిజన్లు ఎలాన్ మస్క్ అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా.. మరికొంతమంది మాత్రం హ్యాష్ ట్యాగ్ ఉపయోగాలను చెబుతున్నారు.
ఈ క్రమంలో... తాను సోషల్ మీడియా మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తానని.. బ్రాండ్ లకు తాను వివరించే మొదటి విషయం ఏమిటంటే.. హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించను అని, కారణం.. అవి అగ్లీగా ఉన్నాయి.. మరియూ అకౌంట్స్ ను స్పామ్ గా కనిపించేలా చేస్తాయి అంటూ ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించారు.
ఇదే సమయంలో... ఒక అంశానికి సంబంధించిన పోస్టులను హైపర్ లింక్ చేయడానికి హ్యాష్ ట్యాగ్ లు ఉపయోగపడతాయని.. ట్రెండింగ్ లో ఉన్న అంశాలను గుర్తించడానికి ఉపయోగపడతాయని మరొకరు స్పందించగా.. హ్యాష్ ట్యాగ్ లపై క్లిక్ చేస్తే ఆ హ్యాష్ ట్యాగ్ తో ఉన్న అన్ని పోస్టులనూ చూడొచ్చని రాసుకొచ్చారు.