Begin typing your search above and press return to search.

అమెరికాలో తనకు భవిష్యత్తు లేదంటున్న కుమార్తె.. మస్క్ రియాక్షన్ ఇదే!

ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అనంతరం మస్క్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 7:43 AM GMT
అమెరికాలో తనకు భవిష్యత్తు లేదంటున్న  కుమార్తె.. మస్క్  రియాక్షన్  ఇదే!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుపున అన్నీ తానైనట్లు పనిచేస్తూ దూసుకుపోయిన ఎలాన్ మస్క్.. ఎన్నికల ఫలితాల అనంతరం ఫుల్ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రంప్ గెలుపు ప్రభావం ఆయన సంపదపై పుష్కలంగా చూపించింది. త్వరలో స్పేస్ ఎక్స్ కూడా ముందుకు దూసుకుపోతోందని అంటున్నారు.

ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అనంతరం మస్క్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో ఎలాన్ మస్క్ కు చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతోంది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో... తాను కొన్నాళ్లుగా భయపడుతున్నది, ఇప్పుడు వాస్తవరూపం ధరించిందని.. అమెరికాలో ఉంటే ఎలాంటి భవిష్యత్తూ కనిపించడం లేదని.. అతడు నాలుగేళ్లే అధ్యక్షుడిగా ఉండనున్నప్పటికీ.. లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రానప్పటికీ.. కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరని ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో అమె అమెరికాను వీడుతుందన్న ఈ విషయం ఆమె పోస్ట్ ద్వారా వెల్లడవుతోన్న నేపథ్యంలో మస్క్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... తన కుమారుడిని ఓక్ మైండ్ సెట్ చంపేసిందని వెల్లడించారు. ఈ ట్వీట్ పై జెన్నా మరోసారి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రి ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి థ్రెడ్ లో పోస్ట్ చేసింది.

ఇందులో భాగంగా... ఇప్పటికీ తన బిడ్డకు ఏదో సోకిందని, తనను తన బిడ్డ ద్వేషించడానికి ఇదే కారణం అని మళ్లీ పాత కథలే చెప్పొద్దని.. వాటిని పట్టించుకోవద్దని.. ఏరకంగా చూసినా తాను బాధితురాలినే అని ఆమె పేర్కొన్నారు. దీంతో.. ఆమె వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా... మస్క్ తొలి భార్యకు జన్మించిన సంతానంలో జస్టిన్ విల్సన్ ఒకరు. అయితే విల్సన్ 2022లో లింగ మార్పిడి చేయించుకొని తన వివియన్ జెన్నా విల్సన్ గా పేరు మారుకొంది. ఎలాన్ మస్క్ కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటి నుంచి జెన్నా విల్సన్.. తన తండ్రి మస్క్ కు దూరంగా ఉంటోంది. ఇప్పుడు ట్రంప్ గెలవడంతో తన ఆవేదనను వెల్లడించింది.