నన్ను చంపేందుకు కుట్ర.. బాంబ్ పేల్చిన ఎలన్ మస్క్
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇటీవల డెమోక్రాటిక్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
By: Tupaki Desk | 26 Feb 2025 5:29 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండతో అమెరికా ప్రభుత్వంలోని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నారు ఎలన్ మస్క్. డోజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతిని, అసమర్థతను, పనులు చేయని అధికారులపై కొరఢా ఝలిపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే చాలా మందికి రుచించక మస్క్ కు వ్యతిరేకంగా మారారు. తాజాగా మస్క్ కూడా ఈ సంస్కరణల వల్ల తన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోందని సంచలన కామెంట్స్ చేశారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇటీవల డెమోక్రాటిక్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 'డోజ్' (DOGE) సంస్కరణలు వారికి ఇష్టంలేదని, పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాలను వెలికితీస్తున్నందుకు డెమోక్రాట్లు తనపై దాడి చేసి చంపేందుకు కుట్ర పన్నుతున్నారని మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఓ యూజర్ ట్విట్టర్‌లో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని మస్క్ వెలికితీస్తున్నారని పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్, "అవును, అందుకే డెమోక్రాట్లు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు" అని రిప్లై ఇచ్చారు. మస్క్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఆయన అందించలేదు. డెమోక్రాటిక్ పార్టీ నుండి కూడా ఈ విషయంపై అధికారిక స్పందన రాలేదు. మస్క్ గతంలో కూడా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు. అయితే, ఈసారి చేసిన ఆరోపణలు మరింత తీవ్రంగా ఉండటంతో వివిధ వర్గాల నుండి స్పందనలు వస్తున్నాయి.