Begin typing your search above and press return to search.

మస్క్ వర్సెస్ ఎంప్లాయీస్.. అమెరికా ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొలదీ ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:10 AM GMT
మస్క్ వర్సెస్ ఎంప్లాయీస్.. అమెరికా ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం
X

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొలదీ ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కమలా హారిస్, ట్రంప్ పోటాపోటీగా తలపడుతున్నారు. సభలు, సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. డిబేట్‌లతో తమ ప్రతిభను చాటుతున్నారు. ఇటీవలే ఇద్దరి మధ్య ప్రముఖ చానల్ నిర్వహించిన డిబేట్ హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శక్తియుక్తులు చాటారు.

ఇదిలా ఉండగా.. అమెరికా ఎన్నికల వేళ ఎలాన్ మస్క్, ఆయన ఉద్యోగుల మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకవిధంగా మస్క్ వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఈ వైఖరితో తేటతెల్లమైంది. ప్రజాస్వామిక దేశంలో ఎవరైనా ఎవరికైనా తమ మద్దతు తెలిపే హక్కు ఉంది. ఎవరు ఎవరికైనా విరాళాలు ఇచ్చుకోవచ్చు.. ఎవరు ఎవరికైనా బహిరంగంగా మద్దతు తెలుపొచ్చు. అయితే.. తాము పనిచేసే కంపెనీ బాస్ ఎటు మద్దతు తెలిపితే ఉద్యోగులు సైతం అటే అండగా నిలవాలనే సిద్ధాంతం ఎక్కడా లేదు. సరిగా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల్లో అదే జరిగింది.

ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నారు. ట్రంప్ గెలుపు కోసం ఇప్పటికే చాలా వరకు విరాళాలు అందించారు. కానీ.. ఎలాన్ మస్క్ కంపెనీల ఉద్యోగులు మాత్రం కమలా హారిస్‌కు గణనీయంగా మద్దతునిస్తున్నారు. యూఎస్ ప్రచార సహకారాలను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. హిందూస్తాన్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. మస్క్ కంపెనీల్లో ఉద్యోగులు డోనాల్డ్ ట్రంప్ కంటే కమలా హారిస్‌కు చాలా ఎక్కువ విరాళాలు ఇచ్చారు.

టెస్లా ఉద్యోగులు ట్రంప్ కోసం 24,840 డాలర్లతో పోలిస్తే టెస్లా ఉద్యోగులు హారిస్ ప్రచారానికి 42,824 డాలర్లు అందించగా.. ట్రంప్‌నకు 24,840 డాలర్లు అందించారు. స్పేస్‌ఎక్స్ ఉద్యోగులు హారిస్‌కు 34,526 డాలర్లు ఇవ్వగా.. ట్రంప్‌కు కేవలం 7,652 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఎక్స్ ఉద్యోగులు హారిస్‌కు 13,213 డాలర్లు ఇచ్చారు. ట్రంప్‌కు కేవలం 500 డాలర్ల కంటే తక్కువే ఇచ్చారు.