Begin typing your search above and press return to search.

అమెరికాలో హాట్ టాపిక్... మస్క్ కు ఐదేళ్ల జైలు శిక్షకు అవకాశం!?

ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం అనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 4:02 AM GMT
అమెరికాలో హాట్  టాపిక్... మస్క్ కు ఐదేళ్ల జైలు శిక్షకు అవకాశం!?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రజలకు హామీలు, ప్రత్యర్థులపై విమర్శలతో అటు డొమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్, ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లో హోరెత్తించేస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా సరే డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు ఎలాన్ మస్క్. ట్రంప్ అధ్యక్షుడయ్యే వరకూ ఆయన పక్కనే ఉంటానంటూ ఇటీవల ప్రకటించుకున్నారు కూడా. అంతేకాదు.. ట్రంప్ ప్రెసిడెంట్ కాకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలు అనే స్థాయి స్టేట్ మెంట్లూ ఇచ్చారు.

ఇదే సమయంలో... ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ఓ కొత్త కార్యక్రమానికి తెరలేపారు. ఇందులో భాగంగా... ట్రంప్ కు మద్దతిచ్చే వారికి రోజుకు ఒకరిని లాటరీ పద్దతిలో ఎంపిక చేసి 1 మిలియన్ డాలర్లు (రూ.8 కోట్లు) పంచుతానని ప్రకటించారు. ఇప్పటికే పలువురికి పంచినట్లు చెబుతున్నారు.

దీంతో... ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.. ఇవి ఫెడరల్ ఎలక్షన్ చట్టాల ఉల్లంఘనల కిందకు వస్తాయని హెచ్చరించింది. అయినప్పటికీ మస్క్ తగ్గడం లేదు. న్యాయశాఖ హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నారు. ట్రంప్ కు మద్దతిచ్చే ఇద్దరు రిజిస్టర్డ్ ఓటర్లకు ఒక మిలియన్ డాలర్ల చొప్పున డబ్బు చెల్లించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ హెచ్చరికలను ఎలాన్ మస్క్ పెడచెవిన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో... ఇది చట్టవిరుద్ధమని తేలితే.. ఎలాన్ మస్క్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడోచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో... అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఈ చర్చ హాట్ టాపిక్ గా మరుతుంది!

కాగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచీ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కి మద్దతు పలుకడంతో పాటు ప్రచార కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున విరాళాలు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రచార కార్యక్రమాల కోసం రూ.470 కోట్లు విరాళాలు ఇచ్చారు. ఇదే సమయంలో.. మొత్తంగా ఇప్పటివరకూ రూ.1,109 కోట్లు ఖర్చు చేసినట్లు కథనాలొస్తున్నాయి!