Begin typing your search above and press return to search.

ఆర్థిక చరిత్రలో తొలిసారి... ఎవరికీ అందనంత ఎత్తులో ఎలాన్ మస్క్!!

ఈ క్రమంలో ట్రంప్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మస్క్ లెక్క విపరీతంగా మారిపోయిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 4:46 AM GMT
ఆర్థిక చరిత్రలో తొలిసారి... ఎవరికీ అందనంత ఎత్తులో ఎలాన్  మస్క్!!
X

మామూలుగానే ఎలాన్ మస్క్ పట్టిందల్లా బంగారం అయిపోతుంటుందని.. అతని విజన్, ప్లానింగ్ అంతలా ఉంటాయని.. ప్రపంచ కుబేరుల్లో టాప్ ప్లేస్ లో ఉండటం వెనుక ఆయన ముందుచూపు పీక్స్ అని అంటుంటారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మస్క్ లెక్క విపరీతంగా మారిపోయిందని అంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో మస్క్ మాత్ర కీలకం అని చెబుతుంటారు. దానికి తగ్గట్లు గానే మస్క్ కు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇచ్చారు ట్రంప్. దీంతో.. ఈ ప్రభావం మస్క్ సంపదపై పుష్కలంగా సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో... మస్క్ నికర సంపద 400 బిలియన్ డాలర్లను దాటేసిందని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచీ మస్క్ వ్యాపారాభివృద్ధికి అడ్డే లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల అంతర్గత వాటా విక్రయం, ఇటీవల యూఎస్ ఎన్నికల ఫలితాల తర్వాత 400 బిలియన్ డాలర్ల నికర విలువను చేరుకున్నారు.

దీంతో... ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిక్ర విలువ చేరుకున్న వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డ్ సృష్టించారని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. స్పెస్ ఎక్స్ అంతర్గత వాటా విక్రయం ద్వారా $50 బిలియన్లు పెరిగి.. అతని మొత్తం నికర విలువ $447 బిలియన్లకు చేరుకుందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

వాస్తవానికి 2022 చివరిలో ఎలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉండెది. అయితే గత నెలలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పపుడు మస్క్ భారీ లాభాలు పొందాడు. ఇదే సమయంలో... టెస్లా ఇంక్ స్టాక్ ఎన్నికల ముందు నుంచి సుమారు 65 శాతం మేర పెరిగిందని అంటున్నారు.

మరోపక్క స్పేస్ ఎక్స్, దాని పెట్టుబడిదారులు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులు, అంతర్గత వ్యక్తుల నుంచి $ 1.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దీంతో.. ఈ ఒప్పందం స్పేస్ ఎక్స్ ని ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా మార్చిందని చెబుతున్నారు.

కాగా.. ట్రంప్ 2.0లో మస్క్.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ (డొజ్) కు సహ-హెడ్ గా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో... ట్రంప్ పాలనలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక.. కంపెనీ ఆదాయం ప్రభుత్వంతో ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. ట్రంప్ పదవీకాలం మస్క్ కంపెనీపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 కుబేరులు!:

ఎలాన్ మస్క్ - $447 బిలియన్స్

జెఫ్ బెజోస్ - $249 బిలియన్స్

మార్క్ జుకర్ బర్గ్ - $224 బిలియన్స్

లారీ ఎల్లిసన్ - $198 బిలియన్స్

బెర్నార్డ్ ఆర్నాల్డ్ - $181 బిలియన్స్

లారీ పేజ్ - $174 బిలియన్స్

బిల్ గేట్స్ - $165 బిలియన్స్

సెర్గీ బ్రిన్ - $163 బిలియన్స్

స్టీవ్ బల్మేర్ - $155 బిలియన్స్

వారెన్ బఫెట్ - $144 బిలియన్స్