Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ కు ఇంక ఆ రెండు కోరికలే మిగిలి ఉన్నాయా?

ట్రంప్ 2.0 లో మస్క్ పాత్రపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో టైమ్ మ్యాగజైన్ ఇంట్రస్టింగ్ కవర్ పేజీని ప్రచురించింది.

By:  Tupaki Desk   |   22 Nov 2024 4:56 AM GMT
ఎలాన్  మస్క్  కు ఇంక ఆ రెండు కోరికలే మిగిలి ఉన్నాయా?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు అనంతరం ఎలాన్ మస్క్ గురించి చర్చ ఇప్పుడు మరింతగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ.. ట్రంప్ 2.0 లో మస్క్ పాత్రపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో టైమ్ మ్యాగజైన్ ఇంట్రస్టింగ్ కవర్ పేజీని ప్రచురించింది.

అవును... ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి టైమ్ మ్యాగజైన్ ఓ కవర్ పేజీని ప్రచురించింది. ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ ఇప్పటివరకూ సాధించిన విజయాలను పేర్కొనడంతో పాటు తరువాత ఆయన చేయాల్సిన జాబితా అదే అయ్యి ఉండోచ్చన్నట్లుగా పొందుపరిచింది. దీన్ని "ట్రంప్ టు డు లిస్ట్" గా పేర్కొంది.

ఈ కవర్ పేజీలో... "సిటిజన్ మస్క్: ఆయన చేయాల్సిన జాబితాలో తరువాత ఏంటి?" అనే టైటిల్ ని ప్రచురించింది. ఇప్పటికే 8 విషయాలను ఆయన సాధించినట్లు పేర్కొంటూ.. ఇంకా రెండు మరింత కీలకమైన పనులు చేయాల్సి ఉందని పేర్కొంది! దీనిపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా... "ఎలాన్ మస్క్ సంపన్నుడు - ఎలక్ట్రిక్ వాహనాలు - ట్విట్టర్ కొనుగోలు - రాకెట్ లాంచ్ – రాకెట్ బ్యాక్ - మనిషి మెదడులో చిప్ – ట్రంప్ ను గెలిపించడం – వర్క్ ఫ్రమ్ మార్ లాగో" వంటివి సాధించేశారని కవర్ పేజీలో పేర్కొంది. ఈ నేపథ్యంలో... 2 ట్రిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించడం - మార్క్ మీదకు వెళ్లడం మిగిలి ఉన్నాయని తెలిపింది.

దీంతో... ఈ కవర్ పేజీ అంశపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా తాను ఎలాంటి మీడియా ఇంటర్వూలు ఇవ్వలేదని.. ఇది వాస్తవానికి తన చెక్ లిస్ట్ కాదని.. జీవితాన్ని బహుళ గ్రహంగా మార్చాలన్నదే తన ప్రయత్నమని.. అయితే, దానికోసం జాబితాలోని కొన్ని అంశాలు అవసరమేనని రాసుకొచ్చారు.

కాగా... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కొత్తగా రూపొందించిన ప్రభుత్వ సమర్థత విభాగానికి నాయకత్వం వహించడానికి ఎలాన్ మస్క్ - వివేక్ రామస్వామిలను నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఫెడరల్ ప్రభుత్వ $7 ట్రిలియన్ బడ్జెట్ నుంచి $2 ట్రిలియన్ల కోతలు లక్ష్యంగా చేసుకున్నట్లు మస్క్ తెలిపిన సంగతీ తెలిసిందే!