Begin typing your search above and press return to search.

మనసులో మాట... మస్క్ కలిసిన ముగ్గురు తెలివైన వ్యక్తులు వీరే!

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఎల్కాన్ మస్క్.. తాను ఎక్కువగా అభిమానించే సీఈవో లేదా తాను ఇప్పటివరకూ కలిసిన అత్యంత తెలివైన వ్యక్తుల వివరాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 March 2025 8:30 PM IST
మనసులో మాట... మస్క్ కలిసిన ముగ్గురు తెలివైన వ్యక్తులు వీరే!
X

ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత, ‘డోజ్’ సారథి ఎలాన్ మస్క్ తన మనసులో మాట చెప్పారు. ఇందులో భాగంగా... ఇప్పటివరకూ తాను కలిసి అత్యంత తెలివైన వ్యక్తులని నమ్ముతున్న ముగ్గురు టెక్ దిగ్గజాల పేర్లను వెల్లడించారు. వర్డిక్ట్ విత్ టెడ్ క్రూజ్ పాడ్ కాస్ట్ లో స్పందించిన టెస్లా సీఈవో.. తాను కలిసిన అత్యంత తెలివైన వ్యక్తుల వివరాలు వెల్లడించారు.

అవును... తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఎల్కాన్ మస్క్.. తాను ఎక్కువగా అభిమానించే సీఈవో లేదా తాను ఇప్పటివరకూ కలిసిన అత్యంత తెలివైన వ్యక్తుల వివరాలు వెల్లడించారు. ఈ జాబితా ఆసక్తిగా మారింది. పైగా.. మస్క్ చెప్పిన ఆ ముగ్గురు తనతో పాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోని వారు కావడం గమనార్హం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు, మొదటి సీఈవో లారీ పేజ్ లను తనకు తెలిసిన అత్యంత చురుకైన, పదునైన వ్యక్తులుగా మస్క్ ప్రశంసించారు. ఈ సందర్భంగా జెఫ్ బెజోస్ చాలా కష్టమైన, ముఖ్యమైన పనులు చేశారంటూ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడిని ప్రశంసించారు.

ఇదే సమయంలో... లారీ ఎల్లిసన్ చాలా తెలివైన వారని.. ఆయన తాను కలిసి తెలివైన వ్యక్తుల్లో ఒకరని తాను చెబుతానని మస్క్ తెలిపారు. 2018 - 2022 మధ్య టెస్లా బోర్డులో పనిచేస్తున్నప్పుడు మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి 1 బిలియన్ డాలర్లు చెల్లించిన ఎల్లిసన్ తో స్పేస్ ఎస్క్ అధినేత దీర్ఘకాల బంధం కలిగి ఉన్నారు!

ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చేయడానికి ఖరీదైన ఎన్విడియా జీపీయూలను పొందడంలో మస్క్ కు ఎల్లిసన్ సహాయం చేసినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరినీ తరచూ అత్యంత సన్నిహితులు అని చెబుతుంటారంట.

ఇదే క్రమంలో... గూగుల్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఫస్ట్ సీఈవో లారీ పేజ్ ను ఎలాన్ మస్క్ ప్రశంసించారు. ఒక వ్యక్తి సాధించిన విజయాలను వారి ఐక్యూ ని అంచనా వేయడానికి ఉపయోగించవచ్చని తాను నమ్ముతున్నానని.. ఈ విషయంలో లారీ పేజ్ చాలా స్మార్ట్ అని మస్క్ తెలిపారు.

కాగా... బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో జెఫ్ బెజోస్, ఎల్లిసన్, లారీ పేజ్ లు వరుసగా $214, $169, $146 బిలియన్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇక బ్లూమ్ బెర్గ్ జాబితాలో ఎలాన్ మస్క్ $303 బిలియన్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.