టెస్లా కార్లు, షోరూమ్స్ తగలబెట్టిన డెమోక్రాట్స్!
అనేక నగరాల్లో ఆందోళనకారులు టెస్లా కార్లను తగలబెట్టడమే కాకుండా షాపులను ధ్వంసం చేశారు.
By: Tupaki Desk | 11 March 2025 1:28 PM ISTప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్ తగిలింది. గత వీకెండ్ అమెరికా వ్యాప్తంగా టెస్లా షోరూమ్లు, డీలర్ షిప్‌లపై తీవ్ర విధ్వంసం జరిగింది. అనేక నగరాల్లో ఆందోళనకారులు టెస్లా కార్లను తగలబెట్టడమే కాకుండా షాపులను ధ్వంసం చేశారు.
- దాడుల వెనుక డెమోక్రాట్ల హస్తం?
ఈ విధ్వంసం వెనుక డెమోక్రాట్స్ మద్దతుతో నడిచే NGOల హస్తం ఉన్నట్లు సమాచారం. ఎలాన్ మస్క్ ఇటీవల ట్రంప్ పాలనలో తన ప్రమేయం పెంచుతున్నారని, DOGE కరెన్సీపై తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు.
- ట్రంప్ మండిపాటు
ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ట్రంప్.. దీనిని డెమోక్రాట్ల కుట్రగా పేర్కొన్నారు. "వీళ్లు మానవ హక్కుల గురించి మాట్లాడతారు కానీ, బిజినెస్‌లను ధ్వంసం చేస్తారు. ఇది అమెరికా ప్రజల పట్ల తీవ్ర అన్యాయం" అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
- మస్క్ స్పందన
టెస్లా సంస్థపై జరుగుతున్న దాడులపై ఎలాన్ మస్క్ స్పందించారు.. ‘దిస్ ఈజ్ క్రేజీ’ అంటూ కామెంట్ చేశారు. మస్క్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం కూడా సీరియస్ గా చర్యలు చేపట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
-FBI దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటనలపై అమెరికా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. FBI ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. టెస్లా వ్యాపార కార్యకలాపాలకు ఇలాంటి దాడులు ఇబ్బందిగా మారతాయా? మస్క్ తుది నిర్ణయం ఏమిటి? అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇక డెమోక్రాట్స్, లెఫ్టిస్టులను నిందిస్తూ ట్రంప్ ఈ దాడులను ఖండించారు.