Begin typing your search above and press return to search.

తెరపైకి పదేళ్ల నాటి వీడియో... చిక్కుల్లో ఎలాన్ మస్క్, ట్రంప్?

ఆ సంగతి అలా ఉంటే... 2013లో ఎలాన్ మస్క్ తో పాటు అతని సోదరుడు కింబాల్ మస్క్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగి ప్రత్యక్షమై పెను దుమారం రేపుతోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 4:23 AM GMT
తెరపైకి పదేళ్ల నాటి వీడియో...  చిక్కుల్లో ఎలాన్  మస్క్, ట్రంప్?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ లు ప్రచారాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. వీరి విమర్శలు, ప్రతి విమర్శలు, హామీల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, అక్రమ వలసల గురించే. ఈ వ్యవహారంపై ఇప్పటికే కమల హామీ ఇవ్వగా.. దానికి డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ కూడా ఇచ్చారు.

ఈ అక్రమ వలసదారుల కారణంగా దేశంలో నేరాలు పెరుగుతుండటంతో పాటు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అంటున్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్ కు సంబంధించిన పదేళ్ల క్రితం నాటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో.. తాము కూడా అక్రమ వలసదారులమే అంటూ ట్రంప్ సోదరుడు బాంబు పేల్చాడు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ కమలా మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేరు కూడా మారుమోగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఆయన తన మద్దతును బాహాటంగనే ప్రకటించారు.

ఆ సంగతి అలా ఉంటే... 2013లో ఎలాన్ మస్క్ తో పాటు అతని సోదరుడు కింబాల్ మస్క్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగి ప్రత్యక్షమై పెను దుమారం రేపుతోంది. 10 ఏళ్ల క్రితం మిల్కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కింబాల్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాము దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు, అక్కడ నుంచి అమెరికాకు వెళ్లినప్పుడు ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము కూడా చట్టవిరుద్ధమైన వలసదారులమె అని తెలిపారు. ఆ సమయంలో స్టార్టప్ నిధుల కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు.

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వెళ ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు... తమ వ్యాపారానికి నిధులు సేకరించడం, అనుమతులు లేకుండా అమెరికాలో వ్యాపారం చేయడం చట్టప్రకారం నేరమని.. అందువల్ల మస్క్ ను దేశం నుంచి బహిష్కరించాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాలు ట్రంప్ కు ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు.