Begin typing your search above and press return to search.

కెనడా ప్రధానిపై జోస్యం... పాలిటిక్స్ లో మస్క్ ఎక్స్ పర్ట్ అయిపోయారా?

ఈ నేపథ్యంలో పాలిటిక్స్ లో ఎక్స్ పర్ట్ అయిపోయారో ఏమో కానీ... కెనడా ఎన్నికలపై జోస్యం చెప్పారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 5:40 AM GMT
కెనడా ప్రధానిపై జోస్యం... పాలిటిక్స్  లో మస్క్ ఎక్స్ పర్ట్  అయిపోయారా?
X

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ట్రంప్ కోసం ప్రచారం చేయడంతో పాటు.. ఆర్థికంగానూ భారీగా ఖర్చు చేశారు! ఈ నేపథ్యంలో పాలిటిక్స్ లో ఎక్స్ పర్ట్ అయిపోయారో ఏమో కానీ... కెనడా ఎన్నికలపై జోస్యం చెప్పారు.

అవును... అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో తనదైన హడావిడి చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు ట్రంప్ గెలిచిన సంబరాల్లో ఉన్నారని అంటున్నారు. అంతరిక్ష రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఇప్పటికే తన ఆనందన్ని ఎక్స్ లో వెల్లడించిన ఆయన.. ఇప్పుడు త్వరలో జరగబోయే కెనడా ఎన్నికలపై జోస్యం చెప్పారు.

కెనడాలో పార్లమెంటరీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. 45వ కెనడియన్ పార్లమెంట్ కు హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులను ఎన్నికొవడానికి ఫెడరల్ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ పై అవాకులు అందులో భాగమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో... "ట్రూడోను వదిలించుకునేందుకు కెనడాకు సాయం చేయండి" అంటూ ఓ యూజర్ ఎక్స్ లో మస్క్ ను కొరారు. ఈ పోస్ట్ పై స్పందించిన మస్క్... "అతడు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు" అంటూ ఆ యూజర్ కు బదులిచ్చారు. దీంతో... ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా... గత కొంతకాలంగా భారత్ - కెనడా మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పతనావస్థకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. నిజ్జర్ హత్య కేసులో భారత్ పై ట్రూడో చేసిన ఆరోపణలను ఢిల్లీ సీరియస్ గా తీసుకుంది. తక్షణం.. అ దేశంలోని భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించేసింది.

ఇదే సమయంలో... ఢిల్లీలో ఉన్న కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురి దౌత్యవేత్తలని బహిష్కరించింది. ఈ స్థాయిలో భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... రాబోయే ఎన్నికల్లో ట్రూడో గెలవరని మస్క్ చెప్పిన జోస్యం ఇప్పుడు ఆసక్తిగా మారింది.