Begin typing your search above and press return to search.

ప్రపంచవ్యాప్తంగా #"ట్విట్టర్ డౌన్" వైరల్... మస్క్ ని తగులుకున్న నెటిజన్స్!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ "ఎక్స్" సేవలకు అంతరాయం ఏర్పడిందనే విషయం ఇప్పుడు తీవ్ర గందరగోళానికి దారి తీసింది!

By:  Tupaki Desk   |   28 Aug 2024 7:06 AM GMT
ప్రపంచవ్యాప్తంగా #ట్విట్టర్ డౌన్ వైరల్... మస్క్ ని తగులుకున్న నెటిజన్స్!
X

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ "ఎక్స్" సేవలకు అంతరాయం ఏర్పడిందనే విషయం ఇప్పుడు తీవ్ర గందరగోళానికి దారి తీసింది! ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయని చెబుతున్నారు. సుమారు 30వేల మందికి పైగా యూజర్లు... తాము ఎక్స్ లో పోస్ట్ చేయలేకపోతున్నామని ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.

అవును... ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిక్టేటర్.కాం ప్రకారం... ఎక్స్ అంతరాయాలను ఎదుర్కొంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలు వెళ్లడిస్తూ... అమెరికాలో 30,000 కంటే ఎక్కువ మందికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో... ప్రస్తుతం "ట్విట్టర్ డౌన్" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోపక్క తమకు ట్విట్టర్ పనిచేస్తోందంటూ మరికొందరు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా... తాము ఎక్స్ లో పోస్ట్ చేయగలుగుతున్నామని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది తమ విభిన్న అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగా... మొదట తాము ఎక్స్ లో పోస్ట్ చేయలేకపోయే సరికి అది తమ ఫోన్ ప్రాబ్లమ్ అనుకున్నామని.. తర్వాతగాని ట్విట్టర్ డౌన్ అయ్యిందని తెలియలేదని ట్వీట్లు పెడుతున్నారు. ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాతే టౌన్ అవ్వడం అనే సమస్య మొదలైందని విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా... స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమస్య నేపథ్యంలో మస్క్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇక ఈ నెలలో ఎక్స్ డౌన్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.!