యూఎస్ నుంచి మస్క్ కు బహిష్కరణ ముప్పు!... టెస్లా సీఈవో రియాక్షన్ ఇదే!
తెరపైకి వస్తోన్న కథనాలు నిజమని తేలితే.. మస్క్ కు బహిష్కరణ ముప్పు ఉండొచ్చనే వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 2 Nov 2024 3:49 PM GMTనవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ లు మీడియాలో ఏ స్థాయిలో ఫోకస్ అవుతున్నారో.. దాదాపుగా అదే స్థాయిలో వినిపిస్తున్న పేరు, కనిపిస్తున్న ఫేసు ఎలాన్ మస్క్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.
ఆ స్థాయిలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో శ్రమిస్తున్నారని, సహకరిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చురుగ్గా వ్యవహరిస్తోన్నరు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇందులో భాగంగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారనే కథనాలు తెరపైకి వచ్చాయి. దీంతో... ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
తెరపైకి వస్తోన్న కథనాలు నిజమని తేలితే.. మస్క్ కు బహిష్కరణ ముప్పు ఉండొచ్చనే వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో... అవే నిజమైతే ఎలాన్ మస్క్ బహిష్కరణకు గురికావొచ్చని.. లేదా, ఆయన అమెరికా పౌరసత్వం అయినా రద్దు కావొచ్చంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
ఇందులో భాగంగా... నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే తనను అణిచివేసేందుకు చేయాల్సిందంతా చేస్తారని.. తాను అదే విషయాన్ని చెప్తుంటే ఆ మాటలను ఇంకా చాలా మంది నమ్మడం లేదని మస్క్ పేర్కొన్నారు.
కాగా.. సౌతాఫ్రికాలో జన్మించిన మస్క్ కు తన తల్లి ద్వారా కెనడా పౌరసత్వం లభించగా.. ఇప్పుడు ఆయన అమెరికా పౌరుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 1990ల్లో మస్క్ తన ఉద్యోగ జీవిత ప్రారంభంలో అమెరికాలో అక్రమంగా నివాసం ఉన్నరంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇదే నిజమైతే ట్రంప్ బహిష్కరణ తప్పకపోవచ్చని అంటున్నారు!