Begin typing your search above and press return to search.

మిత్రుడి భార్యతో మస్క్‌ అఫైర్‌... సంచలన కథనం!

అవును... అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌ తో ఆయన వివాహేతర బంధం సాగించారని..

By:  Tupaki Desk   |   26 May 2024 4:39 AM GMT
మిత్రుడి భార్యతో మస్క్‌  అఫైర్‌... సంచలన కథనం!
X

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట ఆసక్తిగా మారుతున్న సంగతి తెలిసిందే. మస్క్ కు సంబంధించిన వార్త అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా తీవ్ర ఆసక్తి చూపిస్తుందనడంలో సందేహంలేదు. ఈ క్రమంలో తజాగా ఆయన వివాహేతర బంధం గురించిన సంచలన కథనం అమెరికాలో తెరపైకి వచ్చింది.

అవును... అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌ తో ఆయన వివాహేతర బంధం సాగించారని.. అందుకే సెర్గీ దంపతులు విడిపోయారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

దీనికి సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే... 2021లో నికోల్ న్యూయార్క్‌ లో తన పుట్టినరోజు వేడుకలు ఏర్పాటుచేశారు. అయితే... ఆ పార్టీకి సెర్గీ స్నేహితుడైన ఎలాన్‌ మస్క్‌ కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ బంధం మొదలైనట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఇదే క్రమంలో అదే ఏడాది డిసెంబరులో మియామీలో మస్క్‌ సోదరుడు ఇచ్చిన విందులో నికోల్‌ పాల్గొన్నారు.

ఆ సమయంలో.. వీరిద్దరూ కెటమిన్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని, అనంతరం వీరిద్దరూ కొన్ని గంటల పాటు కన్పించకుండా పోయారని ఆ పార్టీకి వచ్చిన నలుగురు ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ఇదే సమయంలో... మస్క్‌ తో తాను శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు నికోల్‌ తన భర్త సెర్గీ బ్రిన్‌, ఇతర కుటుంబ సభ్యుల ముందు కూడా అంగీకరించారట. ఈ విషయాన్నే మరో ముగ్గురు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

ఇక ఆ పార్టీ జరిగిన రెండు వారాల తర్వాత నుంచి విడివిడిగా ఉన్న సెర్గీ, నికోల్‌ 2022లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే దాదాపు 18 నెలల తర్వాత గతేడాది వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నికోల్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ కు రన్నింగ్‌ మేట్‌ గా పోటీ చేస్తున్నారు.

వాస్తవానికి రెండేళ్ల కిందటే మస్క్‌, నికోల్ లకు సంబంధించిన అఫైర్‌ వార్తలు బయటకు రాగా.. వాటిని ఈ ఇరువురూ కొట్టిపారేశారు. ఇందులో భాగంగా... ఆమెతో తనకు ఎటువంటి బంధం లేదని మస్క్‌ అప్పట్లో ట్వీట్‌ కూడా చేశారు. మరోవైపు, ఈ వ్యవహారం కారణంగా మస్క్‌, సెర్గీ స్నేహబంధం కూడా ముగిసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.