హాట్ టాపిక్... ట్రంప్ గెలిస్తే ఎలాన్ మస్క్ @ వైట్ హౌస్!?
అవును... టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ - అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లకు సంబంధించిన ఒక ఆసక్తికర కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది!
By: Tupaki Desk | 30 May 2024 5:30 PM GMTఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం బైడెన్, ట్రంప్ ల మధ్య రసవత్తర పోరు నడుస్తుంది! ఈ సమయంలో ఎలాన్ మస్క్ – డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కీలక విషయాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో... ట్రంప్ గెలిస్తే ఎలాన్ మస్క్ @ వైట్ హౌస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అవును... టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ - అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లకు సంబంధించిన ఒక ఆసక్తికర కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది! ఇందులో భాగంగా "ఎలాన్ మస్క్ ను తనకు సలహాదారుడిగా నియమించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్ హోదాలో అతణ్ని వైట్ హౌస్ కు ఆహ్వానించాలని నిర్ణయించారని తెలుస్తుంది" అంటూ కథనంలో పేర్కొంది.
వాస్తవానికి ఇది అత్యంత చర్చనీయాంశమైన విషయం అనే చెప్పాలి. అయితే... దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోపక్క ట్రంప్, మస్క్ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు జరుగుతున్నట్లు ట్రంప్ ప్రచార బృందంలోని కొంతమంది వెల్లడించారని అంటున్నారు.
ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్థిక, విద్యుత్తు వాహనాలు, సరిహద్దు వ్యవహారాలు వంటి కీలక విధానాల రూపకల్పనలో మస్క్ సలహాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
కాగా... బడా వ్యాపారవేత్త మస్క్ ఇప్పటి వరకు ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. కాకపోతే... గత కొంత కాలంగా డైమోక్రాటిక్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా... మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగడానికి అధ్యక్షుడు బైడెన్ నిర్లక్ష్యపూరిత వైఖరే కారణం అని బహిరంగంగానే విమర్శించారు.