మస్క్ కి మహిళలంటే లోకువా?... తెరపైకి సంచలన ఆరోపణలు!
ఈ క్రమంలో తాజాగా స్పేస్ ఎక్స్ చీఫ్ మస్క్ పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 7 Feb 2024 8:51 AM GMTగత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ, నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు సంబంధించి తాజాగా కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విమానంలో లైంగిక వేదింపులు, తరచూ డ్రగ్స్ తీసుకుంటారు అనే ఆరోపణలు విపరీతంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
అవును... గతంలో ఎలాన్ మస్క్ పై సంచలన ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓ ప్రైవేటు జెట్ లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతోపాటు.. తరచూ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు వినిపించేవి! ఈ క్రమంలో తాజాగా స్పేస్ ఎక్స్ చీఫ్ మస్క్ పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా మహిళలంటే మస్క్ కు చులకన భావం ఉందన్నట్లుగా వారు వ్యాఖ్యానించారు!
ఇందులో భాగంగా... ఎలాన్ మస్క్ ఆఫీసులో లైంగిక వేధింపులపై జోకులు సర్వసాధారణం అయిపోయాయని స్పేస్ ఎక్స్ మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో... పురుషులతో పోలిస్తే మహిళలకు జీతం తక్కువ అని చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఈ విషయాలపై ప్రశ్నించినవారికి తొలగిస్తున్నారని.. మహిళలు, ట్రాన్స్ జెండర్ లను కించపరిచేలా మస్క్ ట్వీట్స్ పె డుతుంటారని సంచలన ఆరోపణలు చేశారు.
కాగా... ఓ ప్రైవేటు జెట్ లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు సుమారు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి స్పేస్ ఎక్స్ సెటిల్మెంట్ చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనం వెల్లడించింది. అయితే... ఆ ఆరోపణలన్నీ పూర్తి అసత్యాలు అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో... ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో ఎలాన్ మస్క్ రెగ్యులర్ గా పాల్గొంటూ.. డ్రగ్స్ ను తీసుకుంటున్నారని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ చీఫ్ గా ఉన్న టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని అందులో పేర్కొంది. దీంతో... ఈ విషయంపైనా స్పందించిన మస్క్... తన శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని చెప్పుకొచ్చారు!