Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ అంత రసికుడా?

స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది

By:  Tupaki Desk   |   12 Jun 2024 11:00 PM IST
ఎలాన్ మస్క్ అంత రసికుడా?
X

స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... తన సంస్థలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులతో మస్క్ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని తెలిపింది. ఇదే సమయంలో తనతో కలిసి పిల్లల్ని కనాలని ఓ ఉద్యోగినిని బలవంతపెట్టాడని వెల్లడించింది. దీంతో... ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... 2017లో మస్క్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ టీం లో ఓ యువతి చేరిందని.. ఆమె చేరిన కొన్ని రోజులకే మస్క్ కన్ను ఆ యువతిపై పడిందని.. ఈ క్రమంలో ప్రతీరోజు రాత్రులు ఆ యువతికి మెసేజ్ లు పంపుతుండేవాడని.. మస్క్ ప్రవర్తనతో ఆమె చాలా అసౌకర్యానికి గురైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

ఇదే క్రమంలో తనతో కలిసి పిల్లల్ని కనాలని ఆ మహిళా ఉద్యోగిని మస్క్ బలవంతం పెట్టేవాడని పేర్కొంది. అయితే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో స్పేస్ ఎక్స్ సంస్థలో ఆమె ఎదుగుదల చాలా కష్టమైపోయిందని వెల్లడించింది. ఇదే సమయంలో మరికొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ముందుకొచ్చి మస్క్ నిజస్వరూపాన్ని బయటపెట్టారని తెలిపింది.

కాగా... గతంలోనూ స్పేస్ ఎక్స్ సంస్థకి చెందిన ఓ మహిళను అసభ్యంగా తాకినట్లు బిజినెస్ ఇన్ సైడర్ ఒక కథనం ప్రచురించింది. ఈ వేధింపులపై ఆమె మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు 2,50,000 డాలర్లు ఇచ్చినట్లు ఆ కథనంలో పేర్కొంది. అయితే అప్పుడు ఆ ఆరోపణలను మస్క్ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అబద్దాలని కొట్టిపడేశారు.

అయితే తాజా ఆరోపణలపై మాత్రం ఎలాన్ మస్క్ ఇంకా స్పందించినట్లు లేరు. కాకపోతే స్పేస్ ఎక్స్ కంపెనీ సీఓఓ గ్వైనీ షాట్వెల్ మాత్రం స్పందించారు. ఇందులో భాగంగా తనకు తెలిసిన గొప్ప మనసున్న మనిషి మస్క్ అని అన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ కట్టుకథలేనని ఆమె చెప్పుకొచ్చారు.