ఏడేళ్ల తర్వాత ఎదురుబదురు... మస్క్ ను చూసి ఏడ్చేసిన తండ్రి!
ఈ సమయంలో ఎలాన్ మస్క్ ను చూసి ఆయన తండ్రి ఎరాల్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారని హైడ్ తెలిపారు. ఎలాన్ మస్క్ సైతం తండ్రిని చూసి చాలా సంతోషించారని ఆమె పేర్కొన్నారు.
By: Tupaki Desk | 24 Nov 2023 1:44 PM GMTఎలాన్ మస్క్... ప్రపంచం మొత్తంలో ఏమాత్రం పరిచయం అవసరం పేరు అని చెప్పినా అతిశయోకి కాదు. స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) మొదలైన వ్యాపారాలతో ప్రపంచంలోనే అత్యంత కుభేరుడిగా అవతరించాడు. ఆ సంగతి అలా ఉంటే... ఎలాన్ మస్క్ కుటుంబంలో ఇటీవల కొన్ని భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయని తెలుస్తుంది. కారణం... సుమారు ఏడేళ్ల తర్వాత ఆయన తన తండ్రి ఎరాల్ మస్క్ ను కలవడమే!
అవును... తండ్రీ కొడుకులు సుమారు ఏడేళ్ల తర్వాత ఎదురుబదురు అయితే ఆ భావోద్వేగ క్షణాలు ఎలా ఉంటాయనేది చాలా మంది ఊహించుకోగలరు. అతితక్కువ మంది అనుభవించి ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల స్టార్ షిప్ ప్రయోగానికి ఎలాన్ మస్క్ తన తండ్రి ఎరాల్ మస్క్ ను కూడా ఆహ్వానించారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఎరాల్ మస్క్ తన మాజీ భార్య హైడ్, మనవరాలు కోరాతో కలిసి హాజరయ్యారు.
ఈ సమయంలో ఎలాన్ మస్క్ ను చూసి ఆయన తండ్రి ఎరాల్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారని హైడ్ తెలిపారు. ఎలాన్ మస్క్ సైతం తండ్రిని చూసి చాలా సంతోషించారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురూ పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించుకున్నారని.. ఈ దృశ్యాన్ని చూసి తాను, తన కూతుళ్లు చాలా సంతోషించామని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా... తండ్రీ కొడుకుల భేటీ అనంతరం వారి మధ్య జరిగిన చర్చ గురించి ఎరాల్ తనకు తెలిపారని హైడ్ అన్నారు. ఇందులో భాగంగా... ఎం.ఆర్.ఎన్.ఏ. పరిశోధన, ఆర్థోపెడిక్ సర్జరీ సంబంధిత అంశాలు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఔషధాల ముప్పు.. మొదలైన విషయాల గురించి చర్చించుకున్నామని ఎరాల్ తనతో చెప్పారని హైడ్ తెలిపారు.
ఇక చివరిసారి ఎలాన్ మస్క్ తన తండ్రిని 2016లో కలిశారట. తన సోదరుడు కింబల్ మస్క్ తో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో తన తండ్రి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సందర్భంగా కలిసినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉండటం వల్లే ఇంతకాలం కలవలేదని ఇటీవల విడుదలైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా... మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ మెగా రాకెట్ "స్టార్ షిప్" ను రూపొందించిన సంగతి తెలిసిందే. టెక్సాస్ తీరం నుంచి గత శనివారం ఈ ప్రయోగం జరిగింది. అయితే నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్ తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అది పేలిపోయింది.