Begin typing your search above and press return to search.

52 ఏళ్ల వ‌య‌సులో 11వ బిడ్డకు తండ్ర‌యిన ‘మ‌స్క్’!

ఎలాన్ మ‌స్క్‌.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 1:24 PM GMT
52 ఏళ్ల వ‌య‌సులో 11వ బిడ్డకు తండ్ర‌యిన ‘మ‌స్క్’!
X

ఎలాన్ మ‌స్క్‌.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎక్క‌డ వివాదం ఉంటే..అక్కడ మ‌స్క్ ఉంటాడు. ప్ర‌పంచ కుబేరుడే అయినా.. ఆయ‌న సిల్లీ విష‌యాల్లో త‌ల‌దూరుస్తుంటాడు. ఇటీవల ప్ర‌పంచ వ్యాప్తంగా ఈవీఎంల వ్య‌వ‌హారంపై వివాదం త‌లెత్తిన‌ప్పుడు.. అందులోనూ ఆయ‌న వేలు పెట్టాడు. ఔను.. ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేయొచ్చు.. అంటూ వివాదాల‌ను మ‌రింత పెంచారు. ఇక‌, టెస్లా కార్ల కంపెనీగా పేరుంది.

ఇదేస‌మ‌యంలో సామాజిక మాధ్యమం ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసి.. `ఎక్స్‌`గా రూపాంత‌రం చేశారు. దీనికి కూడా.. బ్లూ టిక్కులు.. ఆ టిక్క‌లు అంటూ రుసుములు వ‌సూలు చేస్తున్నారు. ఇద‌లావుంటే.. ఈయ‌నకు ఇప్పుడు 52 సంవ‌త్స‌రాల వయ‌సు. ఈ వ‌య‌సులో ఆయ‌న తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ అయిన షివాన్‌ జెలీస్‌తో మ‌స్క్ వివాహేతర సంబంధం కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి.

అయితే.. ఇప్పుడు ఆమె మూడో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌స్క్‌-షివాన్‌ల‌కు ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 2021లోనే వీరికి క‌వ‌ల‌లు జ‌న్మించారు. ఇప్పుడు మూడో బిడ్డ జ‌న్మించింది. ఇదిలావులంటే.. ఇప్ప‌టికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న మ‌స్క్‌కు.. తొలి భార్య ద్వారా.. ఐదుగురు సంతానం ఉన్నారు. రెండో భార్య గ్రిమెస్ ద్వారా.. ముగ్గురు పిల్ల‌లు జ‌న్మించారు. ఇప్పుడు జెలీస్ ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల‌లు.. తాజాగా మ‌రో బిడ్డ పుట్టారు. అంటే.. మొత్తంగా మ‌స్క్‌కు 11 మంది సంతానం ఉన్నారు.

పిల్ల‌ల‌పై ప్ర‌వ‌చనం ఇదే..

సంతానంపై మ‌స్క్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. పిల్ల‌లు ఎక్కువ‌గా ఉంటేనే నాగ‌రిక‌త నిలిచి ఉంటుందని ఆయ‌న అభిప్రాయం. కాగా, జెలీస్‌... మ‌స్క్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన ఉద్యోగిని కావ‌డం గ‌మ‌నార్హం. ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డ ఆయ‌న‌.. చివ‌ర‌కు ఆమె విడాకులు తీసుకునే దాకా చేశారు. ప్ర‌స్తుతం వివాహేత‌ర బంధంతోనే ఇద్ద‌రూ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం గ‌మ‌నార్హం.