Begin typing your search above and press return to search.

ఎక్స్‌ లో మస్క్ కీలక నిర్ణయం... రీట్వీట్, లైక్ కి ఛార్జెస్

మస్క్ తెచ్చిన ఈ కొత్త సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ ప్రకారం.. కొత్తగా ఎక్స్‌ ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి ఒక డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:09 AM GMT
ఎక్స్‌  లో మస్క్  కీలక నిర్ణయం... రీట్వీట్, లైక్  కి ఛార్జెస్
X

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని సోషల్ మీడియా ఫ్లాం "ఎక్స్‌" మరో కీలక నిర్ణయం తీసుకుంది! ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌‌ లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. బ్లూ టిక్, పేరు మార్పు నుంచి ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోస్టింగ్‌ లకు కూడా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు మస్క్!

అవును... ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం "ఎక్స్‌" మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగ... కొత్తగా మరో సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ ను పరీక్షించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో దీన్ని ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా... న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌ లో ఈ కొత్త సబ్‌ స్క్రిప్షన్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

ట్విట్టర్‌ సీఈఓ గా బాధ్యతలను స్వీకరించిన నాటినుంచీ... ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్, మరిన్ని సంస్కరణలకు తెర తీశారు. ఇందులో భాగంగా లోగో మొదలుకుని పలు అంశాల్లో పెను మార్పులు తెచ్చారు. “బ్లూ బర్డ్” లోగోను తొలగించి “బ్లాక్ ఎక్స్‌” ను తెరపైకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో... బ్లూ టిక్‌ బ్యాడ్జిని పొందాలంటే డబ్బులను కట్టాల్సిన పరిస్థితి తెచ్చారు. ఈ సమయంలో రీట్వీట్ చేయాలన్నా, లైక్ కొట్టాలన్నా డబ్బులు చెల్లించే పరిస్థితి తెచ్చారు!

మస్క్ తెచ్చిన ఈ కొత్త సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ ప్రకారం.. కొత్తగా ఎక్స్‌ ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి ఒక డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌ వెర్షన్‌ లో ఇతరుల సందేశాలను రీపోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌ మార్క్‌ చేయడం మొదలైనటువంటి బేసిక్‌ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా... కేవలం అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్‌ లను చదవడం, ఫొటోలు, వీడియోలు చూడటం మాత్రమే చేసేవారికి ఎలాంటి రుసుము అవసరం లేదు.

అయితే ఈ సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ ను ప్రస్తుతానికి కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎక్స్‌ ఖాతా ఉన్నవారిపై ఈ కొత్త వ్యవహారం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే అసలు ఉన్నట్లుండి ఈ సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ ఎందుకు తీసుకొచ్చారని అడిగేవారికీ మస్క్ వద్ద ఒక సమాధానం రెడీగా ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... "ఎక్స్‌"లో నకిలీ ఖాతాల బెడదను అరికట్టడం కోసం తీసుకునే నిర్ణయాల్లో ఇదొకటని చెబుతున్నారు.

ప్రస్తుతానికి ట్రైల్ రన్ లో భాగంగా ఈ సబ్‌ స్క్రిప్షన్‌ ఛార్జీలు న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌ లో మాత్రమే అమల్లోకి తీసుకొచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. దీని ప్రకారం... ఈ రెండు దేశాల్లో ఎక్స్ అకౌంట్‌ ను ఓపెన్ చేయాలంటే డబ్బులు కట్టాలి. ఇది క్రమంగా అన్ని దేశాలకు విస్తరించనుందని చెబుతునారు. దేశాన్ని బట్టి ధరలు మారతాయని చెబుతున్నారు.

కాగా... ఇప్పటికే "ఎక్స్‌ ప్రీమియం" పేరిట ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్‌ ను ఎక్స్‌ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్‌ చేయడం, సుదీర్ఘ సందేశాలను పోస్ట్‌ చేయడం, యాప్‌ ఐకాన్‌ ను నచ్చినట్లుగా మార్చుకోవడం, ఫోల్డర్ల బుక్‌ మార్క్‌ వంటి అదనపు ఫీచర్లను అందిస్తోంది.