యుద్ధంలో వెన్ను చూపితే.. పుతిన్‌ను చంపేస్తారు!
''రష్యా గురించి నేను ఏం మాట్లాడినా.. విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, నేను ఎప్పుడూ తప్పు చెప్పలే దు'' అని మస్క్ అన్నారు
By: Tupaki Desk | 14 Feb 2024 2:30 PM GMTసోషల్ మీడియా దిగ్గజం 'ఎక్స్' యజమాని, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. రష్యా గురించి.. ఆ దేశ అధ్యక్షుడి గురించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ప్రస్తుతం ఉక్రెయిన్‌తో రష్యా తలపడుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీనిలో మనుటయా.. మరణించుటయా.. అనేది రష్యా తేల్చుకోవాలి. అంతేకాదు.. యుద్ధంలో వెన్ను చూపితే.. మాత్రం రష్యాలో తిరుగుబాటు తప్పదు. అధ్యక్షుడు పుతిన్‌ను లేపేస్తారు'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. ఉక్రెయిన్ ఎంత గింజుకున్నా.. రష్యాను ఓడించలేదని మస్క్ వ్యాఖ్యానించారు. అదేసమయం లో రష్యా ఇప్పుడు యుద్ధం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా లేదన్నారు. ఈ మేరకు తాజాగా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతోంది నిజమని, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పడం గమనార్హం. తనపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
''రష్యా గురించి నేను ఏం మాట్లాడినా.. విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, నేను ఎప్పుడూ తప్పు చెప్పలే దు'' అని మస్క్ అన్నారు. ప్రపంప వ్యాప్తంగా పరిణామాలను తాను అంచనా వేస్తుంటానని.. చెప్పిన మస్క్.. ఉక్రెయిన్‌కు ఓటమి తప్పదని హెచ్చరిచారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ తన ఓటమిని అంగీకరించి.. వెనక్కి తప్పుకోవాలని మస్క్ సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగితే ఉక్రెయిన్‌కు మరింత నష్టం జరుగుతుందన్నారు.