Begin typing your search above and press return to search.

జీతం నాలుగు లక్షల కోట్లా?

ఈ స్థాయిలో భారీగా జీతం తీసుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు... ఎలాన్ మస్క్!

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:35 AM GMT
జీతం నాలుగు లక్షల కోట్లా?
X

సాధారణంగా ఉద్యోగుల వేతనం లక్షల్లో ఉంటుంది.. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారి జీతభత్యాలు కోట్లలో ఉంటాయి. కానీ... తాజాగా మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏడాది వేతనం మాత్రం లక్షల కోట్లలో ఉంది! ప్రస్తుతం ఈ విషయం వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థాయిలో భారీగా జీతం తీసుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు... ఎలాన్ మస్క్!

అవును... ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఏడాది వేతనం తెలిసి నోరెళ్లబెడుతున్నారంట నెటిజన్లు! ఇకపై ఆయన వార్షిక వేతనం ఏకంగా 56 బిలియన్ డాలర్లు. అంటే.. సుమారు రూ.4.67 లక్షల కోట్లన్నమాట. దీంతో... ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో మస్క్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.

తాజాగా టెక్సాస్ లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశంలో సీఈవో ఎలాన్ మస్క్ వార్షిక వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్ నిర్వహించరు. ఈ సమయంలో ఆయన వార్షిక వేతనాన్ని ఏకంగా 56 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే.. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడైనా ఈ ప్యాకేజీలో సవరణలు చేసే అవకాశం వాటాదారులకు ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ వార్షిక వేతనంగా సింహభాగం నగదు రూపంలో కాకుండా... "ఆల్ స్టాక్ కంపెన్ జేషన్" గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. అంటే... ఏడాదిలో స్టాక్ విలువ పెంపు ఆధారంగా షేర్లను కేటాయిస్తారన్నమాట. మరోపక్క తన ప్యాకేజ్ లోని స్టాక్ లను ఐదేళ్లపాటు అమ్మే ఆలోచన చేయనని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు.

వాస్తవానికి మస్క్ కు 56 బిలియన్ డాలర్ల వార్షిక వేతనం కోసం 2018లోనే ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే.. ఇంత భారీ ప్యాకేజీ చెల్లించేందుకు కంపెనీ ఇన్వెస్టర్ల గ్రూపు ఇష్టపడలేదు. ఈ సమయంలో మస్క్ వేతన ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని షేర్ హోల్డర్స్ కు విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం సుమారు ఆరేళ్లుగా ప్రతీ మీటింగ్ లోనూ జరుగుతుంది. అయితే ఫైనల్ గా ఈ వేతనం ఫైనల్ అయ్యింది.