ఎలాన్ మస్క్ టెస్లా ఫోన్... డైరెక్ట్ అంగారక గ్రహం నుంచి కాల్స్..?
అవును ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది
By: Tupaki Desk | 5 Aug 2023 4:19 AM GMTప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత... కాదేదీ అసాధ్యం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ సమయంలో ఎలాన్ మస్క్ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్స్ కూడా విడుదల కాబోతున్నాయంటూ ఒక వార్త ఆన్ లైన్ లో వైరల్ అయ్యింది!
అవును... ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఎలాన్ మస్క్ కిల్లర్ ఫీచర్స్ తో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు మస్క్ (పేరడీ) పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఒక ఫోన్ ఫోటోను షేర్ చేశారు. దీంతో మస్క్ ఏమి చేసినా వైరల్ గానే ఉంటుందంటూ కథనాలు మొదలైపోయాయి.
దీంతో నెటిజన్లు చాలామంది ఆశ్చర్యంలో మునిగి పోయారు. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాల గురించి ప్రశ్నల వర్షం కరిపించడంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ఫోన్ వెనుకవైపు టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్ లో జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఆకర్షణీయంగా ఉండటం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఈ ఫోటోను షేర్ చేస్తూ... "టెస్లా ఫోన్ వినియోగానికి ఆసక్తిగా ఉన్నారా?" అంటూ యూజర్లను ప్రశ్నించడంతో... నెటిజన్ల నుంచి ప్రశ్నల, సందేహాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా... నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ కు సమాధానంగా... మార్స్ (అంగారక గ్రహం) నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని ట్విట్టర్ లో సమాధానం తెలిపారు. పైగా... అంతేకాదు ఐఫోన్ 12 మినీ కంటే మెరుగ్గా ఉంటుందని హామి వచ్చింది. సూపర్ స్టన్నింగ్ ఫోన్ ఫోటోతోపాటు, ఇందులో "ప్రీ ఇన్ స్టాల్" అయి ఉంటుందనడంతో అందరూ తప్పులో కాలేశారు.
అనంతరం ఇది నకిలీ (పేరడీ) ఖాతా అని తెలిసి కొంతమంది చికాకు పడగా, మరికొంతమంది నవ్వుకుని లైట్ తీసుకున్నారు! అందుకే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోన్న ఈ రోజుల్లో... సోషల్ మీడియాలో ప్రతీ అంశానికి నిశిత పరిశీలన, ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా కీలకం అని అంటున్నారు.