Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ నిషేధిత డ్రగ్స్ ఎందుకు తీసుకున్నాడో తెలుసా?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన సంస్థ ఎదుగుదలకు ఏకంగా రోజుకు 16 గంటలు పనిచేసేవాడట.

By:  Tupaki Desk   |   19 March 2024 3:30 PM GMT
ఎలాన్ మస్క్ నిషేధిత డ్రగ్స్ ఎందుకు తీసుకున్నాడో తెలుసా?
X

టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన సంస్థ ఎదుగుదలకు ఏకంగా రోజుకు 16 గంటలు పనిచేసేవాడట. దీంతో అతి మానసిక బలం పెంచుకునేందుకు కెటమిన్ అనే డ్రగ్స్ ను వినియోగించినట్లు స్వయంగా ఆయనే వెల్లడించాడు. వైద్యుడి సలహా మేరకు కెటమిన్ పరిమితంగా వాడేందుకు మొగ్గు చూపాడని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మస్క్ డ్రగ్స్ వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథకాన్ని ప్రచురించడం గమనార్హం.

వారంలో ఒకసారి చిన్న మొత్తంలో కెటమిన్ తీసుకునే వారు. ఎక్కువ కాలం మానసిక కుంగుబాటుకు గురి కాకుండా ఉండేందుకే ఆయన డ్రగ్స్ వాడినట్లు తెలిసింది. పరిమితికి మించి వాడితే పరిణామాలు తీవ్రంగా ఉండేవి. మోతాదులో వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాలేదు. 2018లో అమెరికన్ పాడ్ కాస్టర్ జో రోగన్ షోలో గంజాయి వాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ సంస్థను నాసా లిఖిత పూర్వక వివరణ కోరింది. ఫెడరల్ చట్టాల ప్రకారం డ్రగ్స్ వాడకం నేరంగా పరిగణించబడుతుంది. దీంతో మస్క్ స్వయంగా తాను డ్రగ్స్ వాడినట్లు వెల్లడించడం వివాదాస్పదంగా మారింది. ఈనేపథ్యంలో డ్రగ్స్ తీసుకోవడం చట్టపరంగా నేరంగా చూస్తారు. ఇప్పుడు మస్క్ తానే డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

వివిధ పార్టీల్లో మస్క్ డ్రగ్స్ వినియోగించేవాడు. నిషేధిత డ్రగ్స్ వాడకం తప్పు అని తెలిసినా తన పనులు చేసుకునే క్రమంలో శక్తి కోసం అతడు ఇలా చేసినట్లు వెల్లడించడం జరిగింది. తానే స్వయంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్ తన ఉన్నతిని కాపాడుకునే క్రమంలో డ్రగ్స్ తీసుకున్నట్లు చెబుతున్నారు.