ఎలాన్ మస్క్ “ఎక్స్” పై సరికొత్త ఆరోపణలు.. తెరపైకి ఉగ్రముఠాలు!
అవును... ట్విట ర్ (ఎక్స్) ను కొనుగోలు చేశాక "బ్లూ టిక్" కోసం డబ్బులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Feb 2024 12:30 PM GMTఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారా.. ఆయన తీసుకోవడం వల్ల అవి కాలక్రమంలో సంచలనంగానూ, తీవ్ర వివదాస్పదంగానూ మారుతుంటాయా అనే చర్చ ఇటీవల నెట్టింట మొదలైందని తెలుస్తుంది. ఈ క్రమంలో గత కొంత కాలంగా నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్న ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేశాక తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయానికి సంబందించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... ట్విట ర్ (ఎక్స్) ను కొనుగోలు చేశాక "బ్లూ టిక్" కోసం డబ్బులు వసూలు చేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇది మస్క్ తీసుకొన్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయంగా మారింది. ఈ సందర్భంగా పలు ఉగ్రవాద సంస్థలు కూడా మస్క్ పెట్టిన బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ని పొందినట్లు తాజాగా ఒక సంస్థ కీలక నివేదికను తెరపైకి తచ్చింది. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో భాగంగా... ది టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో... ఎక్స్ ప్రవేశపెట్టిన పెయిడ్ సబ్ స్క్రిప్షన్ లో ఉగ్రముఠాలకు బ్లూటిక్ ఇచ్చినట్లు చెబుతుంది! ఇదే సమయంలో అమెరికాలో కార్యకలాపాలను నిర్వహించడంపై నిషేధం ఎదుర్కొంటున్న హెజ్ బొల్లా వంటి సంస్థలు కూడా ఇలా బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ వీటిల్లో ఉన్నట్లు వెల్లడించింది.
కాగా... గతంలో ఉచితంగా కేటాయించే ఈ బ్లూటిక్ ను నెలకు 8 డాలర్లు చెల్లించే విధంగా మస్క్ ని ర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ పోస్టు పెట్టడానికి, మెరుగైన ప్రమోషన్ కు ఇది ఉపయోగపడుతుంది. నాడు ఉచితంగా బ్లూటిక్ పొందేవారిలో ప్రపంచ నేతలు, సెలబ్రెటీలు, జర్నలిస్టులు ఉండేవారు. అయితే దీనిని పెయిడ్ సబ్ స్క్రిప్షన్ గా మార్చడం వల్ల సరికొత్త న్యాయ సమస్యలు ఎదురవ్వడం మొదలయ్యాయని ది టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు ప్రకటించింది.