Begin typing your search above and press return to search.

‘పని గంటలు ఎక్కువంటే ప్రాణం తీస్తాం’!... సీఈఓ ఇన్ బాక్స్ ఫుల్!

ఈ సమయంలో వారానికి 84 పని గంటలు అంటూ ప్రకటించిన సీఈవో మెయిల్ ఇన్ బాక్స్ మరణ బెదిరింపులతో నిండిపోతోందంట.

By:  Tupaki Desk   |   16 Nov 2024 9:17 AM GMT
‘పని గంటలు ఎక్కువంటే ప్రాణం తీస్తాం’!... సీఈఓ  ఇన్  బాక్స్  ఫుల్!
X

ఇటీవల కాలంలో ఉద్యోగుల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పని ఒత్తిడి కారణంగా కొంతమంది యువ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ చర్చ మరింత తీవ్రమవుతోంది. ఈ సమయంలో వారానికి 84 పని గంటలు అంటూ ప్రకటించిన సీఈవో మెయిల్ ఇన్ బాక్స్ మరణ బెదిరింపులతో నిండిపోతోందంట.

అవును... ఇటీవల కాలంలో ఉద్యోగుల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారానికి 80 గంటలు మించి పనిచేయాలని కొంతమంది అంటుంటే.. గతంలో కూడా తాము అలానే చేశామని చెబుతుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం వారానికి నాలుగు పని దినాలతోనే బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయని చేసి చూపిస్తున్నాయి!

ఈ సమయంలో... ఇండియన్ – అమెరికన్ సీఈఓ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ గురించి మాట్లాడుతూ... తన కంపెనీలో వారానికి 84 గంటల పని దినాల గురించి ప్రస్థావించారు. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... 'చంపేస్తాం' అంటు బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు.

మరికొంతమంది నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరహా బెదిరింపులతో అతని మెయిల్ ఇన్ బాక్స్ నిండిపోతుందంట. పని గంటలపై గ్రెప్టైల్ సీఈఓ ఓ భయంకరమైన షెడ్యూల్ ని ప్రకటించారు. దీంతో... దీనిపై అటు ఉద్యోగులు, ఇటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇది ఏమాత్రం భావ్యం కాదని అంటున్నారు.

ఈ సందర్భంగా వారు స్పందిస్తూ.. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పని చేయాల్సి ఉంటుందని.. తరచూ వీకెండ్స్ ని కూడా త్యాగం చేయాల్సి వస్తోందని అంటున్నారు. దీంతో... ఇది టెక్ కంపెనీల్లో యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని దోపిడీ సంస్కృతిపై చర్చను మరోసారి బలంగా తెరపైకి తెచ్చింది!

ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడంతో గుప్తా మరో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... ఈ వర్క్ కల్చర్ స్టార్టప్ ప్రారంభ సంవత్సరంలోనే ఉంటుందని.. తర్వాత కంపెనీ మరింత బ్యాలెన్స్డ్ విధానానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని కొంతమంది ట్రాన్స్ పరెంట్ గా భావిస్తుండగా.. మరికొంతమంది మాత్రం అవుట్ డేటెడ్ అని స్పందిస్తున్నారు.