Begin typing your search above and press return to search.

ఉద్యోగుల ఉదారం.. 120 కోట్ల వ‌ర‌ద సాయం!

వీరిలో భాగంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. వారిలో నాన్ గెజిటె డ్ ఉద్యోగులు.. త‌మ ఒక‌రోజువేత‌నాన్ని ముఖ్య‌మంత్రికి విరాళంగా అందించారు. ఈ మొత్తం సుమారు రూ.120 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 8:00 AM GMT
ఉద్యోగుల ఉదారం.. 120 కోట్ల వ‌ర‌ద సాయం!
X

విజ‌య‌వాడ స‌హా.. ప‌లు ప్రాంతాలు వ‌ర‌ద‌లో చిక్కుకుని రోజుల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతు న్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా లేని దుర్భ‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్ర‌భు త్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న క‌దిలి.. ఆహారం, తాగునీరు అందించినా.. శివారు ప్రాంతాలు కావ‌డంతోపాటు.. పీక‌ల్లోతు వ‌ర‌ద నీరు చుట్టుముట్ట‌డంతో అక్క‌డ దాకా సాయం అంద‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆర్మీ హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల సాయంతో ఆహారం అందించే ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆస్తుల న‌ష్టం మ‌రింత ఎక్కువ‌గా ఉంది. క‌ట్టుకునే బ‌ట్ట‌లు, తినే కంచాలు కూడా .. వ‌ర‌ద నీటికి కొట్టుకుపోయి.. కేవ‌లం క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ప్ర‌జ‌లు మిగిలిపోయారు. ప్ర‌స్తుతం వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ.. వారి క‌ష్టాలు మాత్రం ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు సాయం పైనే వ‌ర‌ద బాధిత ప్ర‌జానీకం కోటి ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు తలా ఓచేయి వేస్తున్నారు. పారిశ్రామిక వ‌ర్గాల నుంచి సినీ ప్ర‌ముఖుల వ‌ర‌కు.. సాయం చేస్తున్నారు.

వీరిలో భాగంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. వారిలో నాన్ గెజిటె డ్ ఉద్యోగులు.. త‌మ ఒక‌రోజువేత‌నాన్ని ముఖ్య‌మంత్రికి విరాళంగా అందించారు. ఈ మొత్తం సుమారు రూ.120 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. దీనికి సంబంధించిన చెక్కుల‌ను ఎన్జీవో ఉద్యోగుల సంఘం నేత‌లు.. ముఖ్య‌మంత్రి ని క‌లిసి అందించారు. ఉడ‌తా భ‌క్తిగా తాము కూడా.. వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సంఘం నేత‌లు తెలిపారు.

వాస్త‌వానికి.. ఉద్యోగులు గ‌త ఐదేళ్ల‌లో అనేక ఇబ్బందులు ప‌డ్డారు. వారికి రావాల్సిన సొమ్ములు కూడా ఇవ్వ‌లేదు. దీంతో అనేక పోరాటాలు చేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిసి.. వారు కూడా ముందుకు రావ‌డం ప‌ట్ల‌స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తమ‌వుతోంది.