నన్ను అంత మాట అన్నందుకే కొట్టా... ఈటల ఫుల్ క్లారిటీ
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని కొట్టిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2025 3:36 AM GMTమల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని కొట్టిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటల ఎందుకు ఇలా చేశారనే ప్రశ్నలు ఎదురైన సమయంలో ఈటల ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని మాట్లాడారట అంట అంటూ తన చర్య వెనుక కారణాన్ని వివరించారు.
'ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయి. మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ LRS ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులు కేసులు పెడుతున్నారు. పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. వాని ఎంగిలి మెతుకులకు ఆశపడి కబ్జాదారును పక్షం వహిస్తున్నారు తప్ప పేదల పక్షాన ఆలోచన చేయలేదు. నిన్న నా దగ్గరికి బాధితులందరూ వచ్చి వారిని పెడుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. నేను వెంటనే సిపి గారికి ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని చెప్పాను. కలెక్టర్ కి ఫోన్ చేసి రోజు ఏదో ఒక కబ్జా మీద ఫోన్ చేయాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నట్టు అని అడిగాను. నేనే స్వయంగా ఈరోజు వస్తా అని చెప్పా.. రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని చెప్పి మహిళలను బెదిరించారు.' అంటూ
ఈటల వివరణ ఇచ్చారు.
రాత్రి పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఈటల రాజేందర్ వివరించారు. `పొద్దున్నే వచ్చాను వీళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాను. అందులో ఒక చిరు ఉద్యోగి.. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను ఈ గుండాలు కూలగొట్టారని నా ఇల్లు చూడమని కోరితే.. అటు వెళ్ళాను. 20 మంది గుండాలు బీరు సీసాలు పెట్టి తాగుతూ ఏం చేస్తారు రా అన్నట్టు చూస్తున్నారు.. రెండు నెలలుగా మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు వీరే అని చూపించగానే.. వారి దగ్గరికి వెళ్ళాను. పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు..రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు..ప్రజల ఓట్లతో గడిచిన బిడ్డగా..ధర్మాన్ని కాపాడటానికి..వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీనిని తప్పుగా భావించడం లేదు. ` అంటూ ఈటల వివరణ ఇచ్చారు.
ప్రజల పక్షాన నిజమైన నిలబడ్డాను అనుకుంటున్నానని తన చర్య పట్ల ఈటల క్లారిటీ ఇచ్చా. `పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను, ప్రజలను కాపాడటంలో విఫలమైనప్పుడు ప్రజలే తిరగబడతారు. మీరు సిగ్గుపడాలి. ఇంతమంది ఇన్ని రోజులుగా దరఖాస్తులు ఇచ్చినా,కోర్టు తీర్పులు ఉన్నా.. న్యాయం వీరి పక్కన ఉన్నా కూడా న్యాయం కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా 25 సంవత్సరాల జీవితంలో ఎవరిమీద చేయెత్తలేదు. బూతులు తిట్టలేదు. కానీ ఈరోజు వ్యవస్థ చూసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్న మీ నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, వారిని రక్షించాలి అనుకుంటే సంపూర్ణమైన ఎంక్వయిరీ చేసి ఎవరి జాగాలని వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలి. దీనిలో ఇన్వాల్వ్ అయిన వారి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వారికి అండగా ఉన్న నాయకులను హెచ్చరించాలి.` అని ఈటల సూచించారు.