Begin typing your search above and press return to search.

ఈటెలకు ఈసారి గెలుపు కష్టమా...?

ప్రస్తుతం ఇదే విషయం మీద హుజూరాబాద్ లో పెద్ద ఎత్తుల లెక్కలు వేస్తున్నారు. నిజానికి చూస్తే హుజూరాబాద్ లో బీయారెస్ కి గట్టి పట్టు ఉంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:30 PM GMT
ఈటెలకు ఈసారి గెలుపు కష్టమా...?
X

బీయారెస్ లో పునాది నుంచి ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్. అందే కాదు కారు పార్టీకి మేము ఓనర్లమని చెప్పిన తరువాత అదే పార్టీ నుంచి ఆయనను బయటకు పంపారు. సుమారుగా రెండు దశాబ్దాల రాజకీయ బంధాన్ని గులాబీ పార్టీ నుంచి తెంచుకుని బీజేపీలోకి అడుగుపెట్టారు రాజేందర్. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి బీయారెస్ మీద కొంత సాధించారు.

కానీ అది సరిపోదు సాధించాల్సింది ఎంతో ఉంది. అసలు కధ ముందు ఉంది. ఇపుడు తెలంగాణా ఎన్నికలు ఉన్నాయి. మరి ఈటెల రాజేందర్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన రాజకీయం ఏంటి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న చర్చ ఇపుడు పెద్ద ఎత్తున సాగుతోంది.

ఇక ఈటెల విషయం చూస్తే ఉప ఎన్నికల్లో అధికార బీయారెస్ పార్టీ ఆయనను ఓడించాలని చూసింది. భారీ ఎత్తున ఖర్చు పెట్టింది. ఎంత చేసినా దానికి అంతకు అంత ధీటుగా ఈటెల కూడా ఖర్చు పెట్టి గెలిచారు. దానికి తోడు ఆయనకు ఆనాడు బీయారెస్ పెద్దలు అన్యాయం చేశారు అన్న సానుభూతి కూడా తోడు అయి ఆ సెంటిమెంట్ తో గెలుపు సాధ్యమైంది అని అంటారు

అయితే అదే సీటు అదే హుజూరాబాద్ లో ఈసారి ఈటెల గెలుపు అంత ఈజీగా ఉండదు అని అంటున్నారు. ఒక వైపు చూస్తే బీయారెస్ నుంచి ఫైర్ బ్రాండ్ లీడర్ ఈటెలకు పోటీగా బరిలోకి దిగుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి చూస్తే కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఫ్యామిలీ నుంచి ఒకరికి సీటు కన్ ఫర్మ్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

అలా కెప్టెన్ ఫ్యామిలీ నుంచి ఒకరికి టికెట్ ఇస్తే హుజూరాబాద్ లో ట్రై యాంగిల్ ఫైటింగ్ ఒక లెవెల్ లో సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈటెలకు ఈ రకమైన త్రిముఖ పోరులో గెలవడం అంత ఈజీగా ఉండదు అని అంటున్నారు.

ప్రస్తుతం ఇదే విషయం మీద హుజూరాబాద్ లో పెద్ద ఎత్తుల లెక్కలు వేస్తున్నారు. నిజానికి చూస్తే హుజూరాబాద్ లో బీయారెస్ కి గట్టి పట్టు ఉంది. అలాగే కాంగ్రెస్ కి కూడా బలం చాలానే ఉంది. ఇపుడు ఈ రెండు పార్టీలు అధికారం కోసం పోటీ పడుతూ గెలుపు గుర్రాలుగా ఉన్నాయి. ఓటర్ల సైకాలజీ ప్రకారం చూస్తే గెలిచే పార్టీ అంటే అధికారంలో ఉండే పార్టీకే ఓటు వేయడం సహజం.

మరి అలా చూస్తే హుజూరాబాద్ లో కేవలం ఈటెల రాజేందర్ సొంత బలం తప్ప బీజేపీకి అక్కడ ఏమీ సొంతంగా లేదు అంటున్నారు. మరి తన సొంత ఇమేజ్ ని ఈటెల రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఫుల్ గా వాడేసుకున్నారు. ఆయనకు నాడు వచ్చిన సానుభూతి కూడా కరిగిపోయింది. ఇపుడు అసలైన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈటెల గెలవడం అంటే బిగ్ చాలెంజి అని అంటున్నారు

ఇక ఈటెల సొంత ఇమేజ్ ని ముందు పెట్టినా పార్టీ బలం కూడా జత కలిస్తేనే తప్ప గెలుపు పిలుపు వినబడదు అని అంటున్నారు. కమలానికి చూస్తే పెద్దగా గ్రౌండ్ లెవెల్ లో బలం లేదు. దాంతో ఈటెల టఫ్ ఫైట్ నే ఎదుర్కోబోతున్నారు అని అంటున్నారు. మరి రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న ఈటెలకు ఈ విషయాలు ఏవీ తెలియవు అని ఏవరూ అనుకోరు.

అందువల్లనే తన గెలుపు మీద సొంత సీటు లోనే డౌట్ ఈటెలకు ఉంది అని అంటున్నారు. ఈ కారణంతోనే ఆయన రెండవ సీటు నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆ రెండవ సీటు ఏమిటి అన్నది చూదాల్సి ఉంది. కేసీయార్ సొంత సీటు గజ్వేల్ నుంచి ఈటెల పోటీకి దిగుతారు అనుకున్నా అక్కడ కూడా గెలిచే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అంతలా సీఎం సీటే నిలబెట్టుకోకపోతే ఇక బీయారెస్ కి అధికారం ఆశలు ఎందుకు ఉంటాయని అంటున్నారు.

సో గజ్వేల్ కాకుండా వేరే సీటు బీజేపీ ఇస్తుందా ఇచ్చినా అసలు బీజేపీకి బలం ఉన్న సీట్లు ఎన్ని వాటిలో ఒక్కొక్కరికి రెండేసి సీట్లు ఇస్తూ పోతే ఇక ఆశావహులకు మిగిలేది ఏముంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక ఈటెలకు తన సొంత సీటులో ఈసారి అంత ఈజీ కాదు అన్న మాటే వినిపిస్తోందిట.