Begin typing your search above and press return to search.

క‌ట్ట‌లే క‌ట్ట‌లు.. ఎటు చూసినా నోట్ల క‌ట్ట‌లే.. ఎక్క‌డ‌? ఎందుకు?

ఇలా.. రెండు రోజులుగా సాగుతున్న వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.250 కోట్లు మాత్ర‌మే లెక్కించిన‌ట్టుచెప్పారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:00 AM GMT
క‌ట్ట‌లే క‌ట్ట‌లు.. ఎటు చూసినా నోట్ల క‌ట్ట‌లే.. ఎక్క‌డ‌?  ఎందుకు?
X

ఎటు చూసినా నోట్ల క‌ట్ట‌లే. ఎక్క‌డ చేయి వేసినా.. క‌ట్ల‌ల ఆన‌వాలే! ప‌రుపులు, బీరువాలు, అల్మ‌రాలు.. ప‌డ‌క గ‌దులు.. ఇలా ఎందెందు వెతికినా.. అందందే నోట్ల క‌ట్ట‌లు ద‌ర్శ‌న‌మించ్చాయి. వీటిని స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు సంచుల్లో కుక్కితే.. ఏకంగా 156 గోనె సంచులు నిండిపోయాయి. ఇక‌, వీటిని లెక్కించేందుకు.. ఏకంగా 36 మిష‌న్లు తెప్పించి.. రేయింబ‌వ‌ళ్లు లెక్కిస్తున్నారు. ఇలా.. రెండు రోజులుగా సాగుతున్న వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.250 కోట్లు మాత్ర‌మే లెక్కించిన‌ట్టుచెప్పారు.

ఏం జ‌రిగింది?

ఒడిశాలోని ప్ర‌ముఖ లిక్క‌ర్ కంపెనీపై ప‌న్ను ఎగ‌వేత కేసు న‌మోదైంది. దీంతో ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల వెల్లడించేందుకు కూడా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆ శాఖ తెలిపింది.

భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌, బౌద్ధ్‌ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో రెండురోజుల తనిఖీల్లో రూ.510 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీరువాలు, అల్మ‌రాలు, ప‌డ‌క‌గ‌దుల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. డబ్బును బొలంగీర్‌ ఎస్‌బీఐ శాఖకు తరలించారు.

ఒడిశా రాష్ట్రంలో 20 ప్రాంతాలతోపాటు జార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో కాంగ్రెస్ జార్ఖండ్ ఎంపీ సాహు పాత్ర కూడా ఉంద‌ని తెలిపారు. ఈయ‌న ఇంటిపైనా ఆదాయ ప‌న్ను అధికారులు దాడులు చేశారు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకున్న ప్ర‌ధాని మోడీ.. ప్ర‌జాసొమ్మును దోచుకున్న అవినీతి వీరుల నుంచి ప్ర‌తి పైసా క‌క్కిస్తామ‌న్నారు.