Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు - 2024... లైవ్ అప్ డేట్స్!

Exit Poll 2024 Live Updates

By:  Tupaki Desk   |   1 Jun 2024 11:16 AM GMT
ఎగ్జిట్  పోల్స్ ఫలితాలు - 2024... లైవ్  అప్  డేట్స్!
X

ఏపీలో హోరా హోరీగా సాగిన సార్వత్రికఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న విడుదలవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తుంటే... కూటమి అధికారంలోకి కన్ ఫాం అని నమ్మకంగా చెబుతున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు.

మరోపక్క తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే మరోసారి సత్తా చాటబోతున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని, అది ఈ ఎన్నికల ఫలితాల్లో తేలబోతుందని బీజేపీ చెబుతుంది. మరోపక్క కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందనే విషయం ప్రజలు గ్రహించారని.. అందుకు బీఆరెస్స్ కు వచ్చే సీట్లే సాక్ష్యం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు!

మరోపక్క.. ఈసారి 400 స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని కేంద్రంలోని ఎన్డీయే కూటమి, బీజేపీ నేతలు చెబుతుండగా... జూన్ 4న మ్యాజిక్ ఫిగర్ 272 మార్కు దాటేది తామేనని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు నొక్కి చెబుతున్నారు. దీంతో... ఈసారి జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేది ఎవరనే విషయంపైనా విపరీతమైన చర్చ జరుగుతుంది.

ఈ ఉత్కంఠ సమయంలో ఏపీ అసెంబ్లీ – లోక్ సభ, తెలంగాణ పార్లమెంట్ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏమి చెప్పబోతున్నాయి.. ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి.. ఎవరి అంచనాలు బలపడబోతున్నాయి.. ఎవరి ధీమా నిలబడబోతుంది.. లైవ్ అప్ డేట్స్ మీకోసం...!


మోడీ హ్యాట్రిక్ అంటున్న "రిపబ్లిక్‌ టీవీ" సర్వే!:

  • ఈసారి ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్న నేపథ్యంలో.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో భాగంగా ఎన్డీయే కూటమి 359 సీట్లు వస్తాయని అంచనా వేసింది రిపబ్లిక్ టీవి. ఇదే సమయంలో... ఇండియా కూటమికి 154, ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.


తెలంగాణ లోక్‌ సభ ఎగ్జిట్‌ పోల్స్‌ "పీపుల్స్‌ పల్స్‌"!:

  • తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లోనూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 7-9 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఇదే సమయంలో... భారతీయ జనతా పార్టీ 6 - 8 స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. ఇదే సమయంలో ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకుంటుందని అభిప్రాయపడింది. అయితే... బీఆరెస్స్ మాత్రం 0 - 1 స్థానాలకు పరిమితమని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.


ఆంధ్రప్రదేశ్‌ లోక్‌ సభ ఎగ్జిట్‌ పోల్స్‌.. పీపుల్స్‌ పల్స్‌!:

  • ఏపీలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ లోక్ సభ స్థానాలు వస్తే.. ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని చెబుతున్న వేళ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీ 13 - 15 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇదే సమయంలో వైసీపీ 3 - 5 స్థానాలు, బీజేపీ 2 - 4 స్థానాలు, జనసేన 2 లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.


మళ్లీ జగనే అంటున్న “చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ”!:

  • అత్యంత ఆసక్తికరంగా సాగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం నేడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో.. చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ తన అంచనాలను వెల్లడించింది! ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశంఉందని తెలిపింది. వీరి అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీకి 110 నుంచి 120 ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి 55 - 65 స్థానాలు రానున్నాయి!


తెలంగాణ లోక్‌ సభ "న్యూస్‌ 18" ఎగ్జిట్ పోల్స్‌!:

  • తెలంగాణలో జరిగిన 17 లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి "న్యూస్ 18" ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్ 5 - 8 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉండగా.. బీజేపీ 7 - 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక బీఆరెస్స్ కు 2 - 5 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌ లోక్‌ సభ ఎగ్జిట్‌ పోల్స్‌... "చాణక్య స్ట్రాటజీస్‌":

  • ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి "చాణక్య స్ట్రాటజీస్" ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి 17 - 18 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వైసీపీ 6 - 7 స్థానాలకు పరిమితం కాబోతుందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "పార్థ" సర్వే!:

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎంత రసవత్తరంగా జరిగిందో.. అంతకు మించి అన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో ఏపీలోని 175 స్థానాలకు సంబంధించి పార్థ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... వైసీపీ 110 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇదే క్రమంలో... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి 55 నుంచి 65 స్థానాల్లో గెలుపు కన్ ఫాం అని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... "ప్రిజం పొలిటికల్ కన్సల్టెన్సీ"!:

  • ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రిజం పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది. ఇందులో భాగంగా ఏపీలో 2014 తరహా ఫలితాలను అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 110 (+/-5) స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇదే సమయంలో వైసీపీ 60 (+/-5) స్థానాల్లో గెలుపు కన్ ఫాం అని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కూటమి గెలుచుకోవడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్న 110 స్థానాల్లోనూ జనసేన 14, బీజేపీ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.


ఏపీ లోక్‌ సభ ఎగ్జిట్‌ పోల్స్‌... “ఏబీపీ - సీ ఓటర్‌”:

  • ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలో 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది ఏబీపీ - సీ ఓటర్ సర్వే. ఇందులో భాగంగా ఏపీలో కూటమి ఆల్ మోస్ట్ క్లీన్ స్వీప్ అనే స్థాయిలో ఫలితాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 21 - 25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పగా... వైసీపీకి 0 నుంచి 4 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరుల ప్రస్థావన శూన్యం అని తెలిపింది!


ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... "ఆత్మ సాక్షి"!:

  • ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి "ఆత్మ సాక్షి" సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా వైసీపీ 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే క్రమంలో... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 59 - 77 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్.. "రాప్‌ స్ట్రాటజీస్‌":

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాల్లో హోరా హోరీ పోరు జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రాప్ స్ట్రాటజీస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా 175 స్థానాల్లోనూ వైసీపీ 158 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పగా.. టీడీపి కూటమి కేవలం 4 - 17 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇదే క్రమంలో 13 స్థానాల్లో కీ కంటేస్ట్ ని తెరపైకి తెచ్చింది!


ఏపీ అసెంబ్లీ - లోక్ సభ ఎగ్జిట్ పోల్స్.. "కేకే సర్వే":

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేకే సర్వే సంస్థ ఆసక్తికర ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది! ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు నెట్టింట వైరల్ గా మారాయి! ఇందులో భాగంగా... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 161 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని కేకే సర్వే అంచనా వేసింది. ఇదే క్రమంలో వైసీపీకి కేవలం 14 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ఇక లోక్ సభ స్థానాల్లోనూ కూటమి పెర్ఫార్మెన్స్ వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంటుందని తెలిపింది కేకే సర్వే. ఇందులో భాగంగా... 25 లోక్ సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే గెలుపొందుతారని.. వైసీపీ కి ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానం కూడా దక్కదని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... "పోల్ స్ట్రాటజీ గ్రూప్"

  • ఏపీలో అత్యంత ఆసక్తికరంగా సాగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు శనివారం సాయంత్రం నుంచి హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోల్ స్ట్రాటజీ గ్రూప్.. తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఇందులో భాగంగా... ఈ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గానూ 115 నుంచి 125 సీట్లలో విజయ బావుటా ఎగరేసే అవకాశం ఉండగా... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 50 నుంచి 60 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... "పయనీర్":

  • ఏపీలో అత్యంత రసవత్తరంగా సాగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఇప్పుడు వాతావారణాన్ని మరింత వేడెక్కించేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి పయనీర్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం... ఏపీలో ఎన్డీయే కూటమి (బీజేపీ - టీడీపీ - జనసేన) 20 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా... వైసీపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... "ఆర్ టీవీ":

  • ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రవిప్రకాశ్ నేతృత్వంలో నడుస్తున్న ఆర్ టీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఈ సందర్భంగా 2019లో వచ్చిన ఫలితాలు ఆల్ మోస్ట్ రివర్స్ అవుతాయన్నట్లుగా ఆర్ టీవీ అంచనా వేసింది.ఇందులో భాగంగా... ఏపీ అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 144 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా.. వైసీపీ 31 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆర్ టీవీ అంచనా వేసింది. ఇదే సమయంలో... కూటమి 21 - 25 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసే అవకాశాలు ఉండగా... ఆర్ టీవీ 0 - 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "అగ్ని వీర్"!:

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల వాతావారణాన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత వేడెక్కించేస్తున్నాయి. ఈ సమయంలో అగ్ని వీర్ సంస్థ ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ కు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి 124 నుంచి 128 స్థానాల్లో విజయం ఖాయమని.. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి 46 - 49 స్థానాల్లో గెలుపు కన్ ఫాం అని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "పోల్ లేబొరేటరీ"!:

  • ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి శనివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సందడి చేస్తూ.. రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేస్తున్నాయి. ఈ సమయంలో పోల్ లేబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది.ఇందులో భాగంగా వైసీపీకి 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 108 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి 67 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "జనగళం"!:

  • ఏపీలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనగళం సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీలో 2014 తరహాలోనే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.ఇందులో భాగంగా... ఏపీలోని 175 స్థానాలకు గానూ టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 104 నుంచి 118 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా... వైసీపీకి 44 - 57 సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో ఇతరులకు 0 - 1 స్థానంలో అవకాశం ఉందని తెలిపింది!


ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్... "టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్":

  • ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అందుకు ఒక కారణం... ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ... కేంద్రంలోని ఏ కూటమితోనూ జతకట్టకపోవడం. ఈ సమయంలో టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 25 లోక్ సభ స్థానాల్లోనూ వైసీపీ 14 స్థానాల్లో గెలుస్తుందని.. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 11 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "పీటీఎస్ గ్రూప్":

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వాతావారణం పోలింగ్ తర్వాత తిరిగి శనివారం (జూన్ 1) సాయంత్రం నుంచి తీవ్ర స్థాయిలో వేడెక్కిందనే చెప్పాలి. అందుకు కారణం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడటమే! ఈ క్రమంలో పోల్ ట్రెండ్స్ & స్ట్రాటజీస్ (పీటీఎస్ గ్రూప్) తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఒక ఐదు స్థానాలు అటు ఇటుగా 128 నుంచి 131 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీటీఎస్ గ్రూప్ తెలిపింది. ఇదే సమయంలో వైసీపీకి ఒక ఐదు సీట్లు అటు ఇటుగా 44 నుంచి 47 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్... "భారత్ పొలిటికల్ సర్వే":

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతుండటంతో రాజకీయ వాతావరణం తీవ్ర స్థాయిలో వేడెక్కుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలపైనే చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ సమయంలో బీపీఎస్ (భారత్ పొలిటికల్ సర్వే) ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... వైసీపీ 51.51శాతం ఓట్ షేర్ తో 149 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 45.23% ఓట్ షేర్ తో 26 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో... వైసీపీ 23 లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా... కూటమి రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "ఎస్-జెడ్ సర్వే":

  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం నుంచి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్-జెడ్ సంస్థ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... ఎస్.జీఈడీ సంస్థ ఏపీలోని 175 స్థానాలకు గానూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఈ క్రమంలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 139 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది. అదేవిధంగా... వైసీపీ 36 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "జన్ మత్ పోల్":


  • ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు ఒక్కసారిగా ఏపీలో సరికొత్త ఉత్కంటను, చర్చను తెరపైకి తెస్తున్నాయి. ఈ సమయంలో జన్ మత్ పోల్ సంస్థ ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ 95 నుంచి 103 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పగా... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 67 - 75 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.


ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్... "స్మార్ట్ పోల్":

  • ఏపీలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 సాయంత్రం నుంచి హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్ పోల్ సంస్థ ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 8 స్థానాలు అటు ఇటుగా 93 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో... అదే 8 స్థానాలు అటు ఇటుగా వైసీపీ 82 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక 25 లోక్ సభ స్థానాల విషయానికొస్తే... టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 13 నుంచి 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా.. 9 నుంచి 12 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని స్మార్ట్ పోల్ సంస్థ అంచనా వేసింది.