Begin typing your search above and press return to search.

జూన్ 1 సాయంత్రం ఆరు గంటల కోసం !

ఇంతకాలం ముసుగులో గుద్దులాటగా సాగిన వ్యవహారానికి చాలా ఎక్కువ మోతాదులో ముసుగు వీడబోతోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 4:43 PM GMT
జూన్ 1 సాయంత్రం ఆరు గంటల కోసం !
X

దేశమంతా ఒక్కటే ఆతృతగా ఎదురుచూస్తోంది. అలాగే ఏపీ కూడా ఎదురుచూసే డేట్ టైం ఒక్కటే అదే. జూన్ 1 సాయంత్రం ఆరు గంటలు. అప్పటితో దేశంలో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అంతే క్షణం కూడా ఆలస్యం లేకుండా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేస్తాయి.

అంతే ఏపీలో ఎవరిది అధికారం అన్న దాని మీద ఒక పక్కా లెక్క అయితే దొరుకుతుంది. ఇంతకాలం ముసుగులో గుద్దులాటగా సాగిన వ్యవహారానికి చాలా ఎక్కువ మోతాదులో ముసుగు వీడబోతోంది. ఎందుకంటే ఒక సంస్థ కాదు అనేక సంస్థల నివేదికలు వస్తాయి.

కాబట్టి ఒకరు పట్టుకోలేనిది మరొకరి కంట పడవచ్చు. అలా ఏపీ ఫలితం మీద ఒక కచ్చితమైన క్లారిటీ అయితే రావచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే దేశంలో ప్రధాని ఎవరు అవుతారు అన్న చర్చకు కూడా రేపు ఎంతో కొంత జవాబు దక్కే సూచనలు ఉన్నాయి. కొద్ది పాటి మెజారిటీతో అయినా ఎన్డీయే గెలిస్తే మోడీ మాస్టర్ మరోమారు ప్రధాని అవడం ఖాయం. కానీ అది కాస్తా రివర్స్ గేర్ కొట్టి ఇండియా కూటమికి ఎడ్జ్ ఇచ్చినా లేక వారి వైపు ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపించినా జూన్ 4న మొత్తం కధే మారిపోతుంది.

ఓవరాల్ గా చూస్తే ఇదీ ఏపీలో దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి. ఇదే ఓటర్ నాడి కూడా. అది ఏమిటి అన్నదే ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసే సంస్థలు ప్రముఖమైనవే. అవి చాణక్య.ఇండియాటుడే - మైయాక్సిస్, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ వంటి పలు జాతీయ మీడియా సంస్థలుగా ఉండబోతున్నాయి.

అంతే కాదు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి కాస్తా వెరైటీ గా ఆరా మస్తాన్ మీడియా మీటింగ్ ని ఏర్పాటు చేసి మరీ తన సర్వే వివరాలను వెల్లడించబోతున్నారు అని భోగట్టా.

అది కూడా ఆయన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలోని మద్దిరాల గ్రామంలో అని చెబుతున్నారు. అంటే ఆరా మస్తాన్ ఏమి చెప్పబోతున్నారు అన్నది మాత్రం ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఆయన చెప్పిన సర్వే నివేదికలు నిజం అయ్యాయి. కేసీఆర్ తెలంగాణాలో ఒక స్థానంలో ఓటమి పాలు అవుతారు అని చెప్పిందే ఆరా మస్తాన్.

సో ఆయన చెప్పేది ఎక్కువ పాళ్ళు నిజం అవుతుంది అన్నది అందరికీ ఉంది. ఇక లోకల్ సర్వేలు చాలా ఉన్నాయి. వీటిలో పాతిక నుంచి ముప్పయి దాకా ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే మీడియా ముఖంగా కానీ యూ ట్యూబ్ ముఖంగా కానీ జనంలోకి వదల బోతున్నారు. ఏది ఏమైనా జూన్ 1స్ట్ నే బిగ్ డే గా అంతా చూస్తున్నారు.

ఎగ్జ్టి పోల్స్ లో కొన్ని సందేహాలకు జవాబులు కనుక్కోవాలని చూస్తున్నారు. జగన్ దా చంద్రబాబుదా ఎవరిది అధికారం అన్నది ఒకటి అయితే పిఠాపురం నుంచి పవన్ గెలవబోతున్నారా అన్నది మరోటి. కుప్పంలో బాబు గెలుపు మెజారిటీ అలాగే పులివెందులలో జగన్ మెజారిటీ. ఇక కడప ఎంపీ సీటులో షర్మిలకు వచ్చే ఓట్లు ఆమె ప్లేస్ ఇలాంటివి అన్నీ కూడా ఎంతో కొంత పిక్చర్ ఇచ్చేందుకు ఎగ్జిట్ పోల్స్ ట్రై చేస్తాయని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.