ఈ నెయిల్ పాలిష్ మూడుబెంజ్ కార్లకు సమానం!
ఆడవారికి బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే అమితమైన ఇష్టం ఉంటుందని, మార్కెట్ లోకి వచ్చే సరికొత్త ఉత్పత్తులపై కొంతమంది మహిళలు రెగ్యులర్ గా సెర్చ్ చేస్తూ ఉంటారని అంటుంటారు
By: Tupaki Desk | 7 Oct 2023 11:47 AM ISTఆడవారికి బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే అమితమైన ఇష్టం ఉంటుందని, మార్కెట్ లోకి వచ్చే సరికొత్త ఉత్పత్తులపై కొంతమంది మహిళలు రెగ్యులర్ గా సెర్చ్ చేస్తూ ఉంటారని అంటుంటారు. ముఖ్యంగా లిప్ స్టిక్ లు, నెయిల్ పాలిష్ లపై మరింత ఆసక్తిని కనబరుస్తారని అంటుంటారు. ఈ నేపథ్యలో తాజాగా ఒక "భారీ" నెయిల్ పాలిష్ దాని ధరతో వార్తల్లో నిలిచింది.
అవును... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే అంటూ ఒక కంపెనీ ఉత్పత్తి నెట్టింట వైరల్ అవుతుంది. పైగా ధర విషయంలో అది ఎక్కడో ఉందని చెబుతున్నారు. ఆ నెయిల్ పాలిష్ కొనే సొమ్ముతో... కాస్త అటు ఇటుగా మూడు బెంజ్ కార్లు కొనొచ్చని చెబుతున్నారు. అసలు ఏమిటీ కథాకమీషు అనేదీ ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఆడవారు వాడే వస్తువుల్లో ఖరీదైన దుస్తులు, చెప్పులు, బెల్ట్ లు, హ్యాండ్ బ్యాగ్ లు, ఆర్నమెంట్స్ ల గురించి వింటుంటాం. అయితే తాజాగా వైరల్ ఇష్యూ అవుతున్న ఒక నెయిల్ పాలిష్ ధర చెబితే అవాక్కవుతారు. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ అని అంటున్నారు. దాని పేరు అజాచర్.
లాస్ ఏంజెల్స్ కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్ తయారు చేసిన ఈ నెయిల్ పాలిష్ కి చాలా ప్రత్యేకత ఉందంట. అందువల్లే ఇంత ధర పలుకుతోందని అంటున్నారు. ఈ బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ కొనాలంటే కోటిన్నర రూపాయలకు పైగా సొమ్ము చెల్లించాలి. ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ వస్తువులను తయారు చేసే అజాచర్ పోగోసియన్ తన పేరుతో ఈ ఖరీదైన నెయిల్ పాలిష్ తయారు చేసాడు.
వాస్తవానికి ఈ నెయిల్ పాలిష్ ను దూరం నుంచి చూస్తే సాధారణంగా అనిపిస్తుంది కానీ... కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ నెయిల్ పాలిష్ లో 267 క్యారెట్ బ్లాక్ డైమండ్ కనిపిస్తుంది. దీంతో దీనికోసం రూ. 1,63,66,000 ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే... ఇంతధర పెట్టి నెయిల్ పాలిష్ ఎవరు కొంటారులే అనుకుంటే మీరు నెయిల్ పాలిష్ లో కాలు వేసినట్లే! ఎందుకంటే... కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటికే సుమారు 25 మంది ఈ నెయిల్ పాలిష్ ను కొనుగోలు చేసారట.