Begin typing your search above and press return to search.

సైబర్ దొంగల బరితెగింపు: రూ.500 కోసం సీజేఐ పేరు వాడారు

దేశంలో సైబర్ నేరస్తుల తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆశ చూపటం.. లేదంటే మోసపూరిత తీరుతో మోసాలకు పాల్పడుతున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:33 AM GMT
సైబర్ దొంగల బరితెగింపు: రూ.500 కోసం సీజేఐ పేరు వాడారు
X

దేశంలో సైబర్ నేరస్తుల తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆశ చూపటం.. లేదంటే మోసపూరిత తీరుతో మోసాలకు పాల్పడుతున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఇతర ప్రజాప్రతినిధుల పేరుతో తప్పుడు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు దండుకుంటున్న వారు.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేయటం.. ఆయన పేరును వాడేయటం విస్తుపోయేలా చేస్తోంది.

తమను తాము సీజేఐగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. రూ.500 పంపాలని కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ లా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. తాను అర్జెంట్ పని మీద వెళుతున్నానని.. ట్రాఫిక్ జాంలో ఇరుక్కొన్నట్లుగా పేర్కొంటూ.. క్యాబ్ ఛార్జీల కోసం రూ.500 పంపాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కంప్లైంట్ ను ఢిల్లీ సైబర్ క్రైం విభాగానికి సుప్రీంకోర్టు తాజాగా చేసింది.

సోషల్ మీడియాలో తన పేరు మీద జరిగిన చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూసిన చంద్రచూడ్ విస్మయానికి గురయ్యారు. వెంటనే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైం విభాగంలో ఎఫ్ఐఆర్ చేశారు. దేశ చీఫ్ జస్టిస్ ను వదలకుండా బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్ల లెక్క తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.