ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎలుగుబంటి అయిన మనిషి.. వైరల్!
ఈ ప్రపంచంలో తాము చాలా తెలివైన వాళ్లమని.. తాము మోసం చేస్తే ఎవరూ గ్రహించలేరని చాలా మంది భావిస్తుంటారని అంటుంటారు.
By: Tupaki Desk | 14 Nov 2024 4:30 PM GMTఈ ప్రపంచంలో తాము చాలా తెలివైన వాళ్లమని.. తాము మోసం చేస్తే ఎవరూ గ్రహించలేరని చాలా మంది భావిస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని నలుగురు వ్యక్తులు ఇలానే ఆలోచించినట్లున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎలుగుబంటి వేషాలేశారు.. చివరికి అడ్డంగా దొరికి, ఊచలు లెక్కేస్తున్నారు!
అవును... అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నలుగురు వ్యక్తులు.. రూబెన్ టామ్రాజియన్ (26), వాహే మురద్ఖాన్యన్ (32), అల్ఫియా జుకర్ మాన్ (39), అర్రత్ చిర్కినియన్ (39) కలిసి వారి లగ్జరీ కార్లను వారే ధ్వంసం చేసుకొని ఇన్సూరెన్స్ పొందాలనే ఆలోచన చేసారు! బీమా సంస్థకు సందేహం రావడంతో డిటెక్టివ్స్ కు దొరికిపోయారు.
వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ కాలిఫోర్నియాలోని నలుగురు వ్యక్తులు తమ కార్లను తామే ద్వంసం చేసుకుని ఇన్సూరెన్స్ పోందాలనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగా... లాస్ ఏంజెలెస్ లోని ఓ కొండప్రాంతంలో తమ కారు 2010 నాటి రోల్స్ రాయల్స్ ఘోస్ట్ ను ఎలుగుబంటి దాడిచేసి పాడు చేసిందని ఇన్సూరెన్స్ సంస్థ వద్ద క్లైమ్ చేశారు.
దీనికి సాక్ష్యంగా వీడియోలు, ఫోటోలు సమర్పించారు. అయితే... వీరు సమర్పించిన దృశ్యాలు, ఫోటోలు చూసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి సందేహం వచ్చింది. దీంతో... డిటెక్టివ్స్ ను ఆశ్రయించింది. దీంతో.. అసలు విషయం తెరపైకి వచ్చింది. దీనిపై ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించింది కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్.
ఇందులో భాగంగా... లాస్ ఏంజిలెస్ లో ఉన్న శాన్ బెర్నార్డినో పర్వతాల్లోని లేక్ ఆరోహెడ్ వద్ద పార్క్ చేసి ఉన్న 2010నాటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ ను జనవరి 8న ఎలుగుబంటి దాడిచేసి పాడు చేసిందని చెప్పారని.. దీనికి సంబంధించి సమర్పించిన వీడియోను దర్యాప్తు చేసిన తర్వాత ది ఎలుగుబంటి దుస్తుల్లో ఉన్న మనిషి అని నిర్ధారించబడిందని వెల్లడించింది.
ఈ స్కాం వల్ల బీమా కంపెనీలకు $1,41,839 నష్టం వాటిల్లిందని డిపార్ట్ మెంట్ తెలిపింది. ఎలుగుబంటి దుస్తులు, దాని ఆకారంలో ఉన్న తల, పాదాలతో పాటు పంజా గుర్తులను అనుకరించడానికి మెటల్ పనిముట్లను అనుమానితుల ఇంటిలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.