Begin typing your search above and press return to search.

ఐటీ రిట‌ర్న్స్‌: సొమ్ములు కాదు.. నోటీసులు.. ఏం జ‌రిగింది?

దేశంలో ఇప్పుడు ప‌న్నుల వ‌సూళ్ల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబం ధించిన ప‌న్నుల రిట‌ర్న్స్‌లు అంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 12:30 PM GMT
ఐటీ రిట‌ర్న్స్‌:  సొమ్ములు కాదు.. నోటీసులు.. ఏం జ‌రిగింది?
X

దేశంలో ఇప్పుడు ప‌న్నుల వ‌సూళ్ల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబం ధించిన ప‌న్నుల రిట‌ర్న్స్‌లు అంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. కొంద‌రికి వ‌స్తున్నాయి.. మ‌రికొంద రికి రిట‌ర్స్న్ రావ‌డం లేదు. పైగా నోటీసులు అందుతున్నాయి. హైద‌రాబాద్‌లోనే ఐటీ రిట‌ర్న్స్ పెట్టుకు ని వేచి చూస్తున్న ఐటీ ఉద్యోగుల‌కు సొమ్ములు రావాల్సింది పోయి.. నోటీసులు వ‌స్తున్నాయి. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది.

పైగా.. మీరు ఈఎంఐలు క‌డుతున్నారు. చూపుతున్న ఆదాయానికి.. క‌డుతున్న ఈఎంఐల‌కు పొంత‌న లేదంటూ.. ఐటీ శాఖ ఇస్తున్న నోటీసుల్లో పేర్కొన‌డంతో ఉద్యోగులు ఖంగు తింటున్నారు. రూ.15 వేల రిట‌ర్న్స్ వ‌ర‌కు ఓకే. కానీ, అంత‌కు మించి రిట‌ర్న్స్ దాఖ‌లు చేసిన వారికి .. ఐటీ శాఖ నుంచి నోటీసులు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి గ‌త ఏడాది వ‌ర‌కు పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేకుండా రిట‌ర్న్స్ పెట్టుకున్న వారికి న‌గ‌దు వెన‌క్కి వ‌చ్చేది. ఎంత క‌ట్ అయితే.. అంత వెన‌క్కి ఇచ్చేవారు.

అయితే.. ఈవిష‌యంలో బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల‌లో 3 వేల మంది ఉద్యోగులు న‌కిలీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేశార‌ని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ద‌క్షిణాది రాష్ట్రాల ఐటీ కేంద్ర కార్యాల‌యం గుర్తించిం ది. దీంతో వారంద‌రికీ నోటీసులు పంపించింది. అంతేకాదు.. త‌ప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో రిట‌ర్న్స్ దాఖ‌లు చేసిన వారికి.. మూడు రెట్లు ఫైన్ విధించింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రింత‌గా ప‌న్ను రిట‌ర్న్స్ ను క‌ట్ట‌డి చేసిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే రూ.15 వేల‌కు పైబ‌డి రిట‌ర్న్స్ పెట్టుకున్న ఉద్యోగులకు గ‌త రెండు రోజుల నుంచి నోటీసులు అందుతున్నాయి. దీంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. అన్ని చూసుకొని కరెక్ట్ గా వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు.