హార్దిక్ పాండ్యా-నటాషా విడాకులకు కారణాలివే!
హార్దిక్ పాండ్య-నటాషా స్టాంటోకోవిచ్ విడిపోయిన సంగతి తెలిసిందే. నటాషా తన స్వదేశానికి కూడా తిరిగి వెళ్లిపోయింది.
By: Tupaki Desk | 26 Aug 2024 1:30 AM GMTహార్దిక్ పాండ్య-నటాషా స్టాంటోకోవిచ్ విడిపోయిన సంగతి తెలిసిందే. నటాషా తన స్వదేశానికి కూడా తిరిగి వెళ్లిపోయింది. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది? ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం మనస్పర్దలు అనే అంశం హైలైట్ అయింది తప్ప! అసలు మనస్పర్దలకు కారణం ఏంటి? అన్నది బయటకు రాలేదు. తాజాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడిచించినట్లు తెలుస్తోంది.
నటాషా ఇష్టాను సారం ఉండటాన్ని హార్దిక్ జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. తన స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగించకూడదు అన్న తీరులు నటాషా నడుచుకునేదట. హార్దిక్ ప్రవర్తనతో కుటుంబానికి సన్నిహి తంగా ఉండే మరో వ్యక్తి వలన కూడా నటాషా విసుగు చెందిందని అంటున్నారు. ఈ రెండు అంశాలే ఇద్దరి మధ్య మనస్పర్దలకు దారి తీసాయని చెబుతున్నారు.
ఇలా ఇష్టం లేకుండా కాపురం చేయడం కష్టమని భావించి విడిపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. హార్దిక్ దూకుడు వ్యక్తిత్వం కూడా హైలైట్ చేస్తున్నారు. ఆ దూకుడు స్వభావంతో నటాషా ఇబ్బంది పడిందని అందుకే విడిపోయినట్లు నేషనల్ మీడియా పోర్టల్ తెలిపింది. పాండ్యా ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు చెప్పినా వినలేదని నటాషా సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
విడిపోవడం అన్నది కఠిన నిర్ణయం అయినా తప్పని పరిస్థితుల్లో నటాషా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నటాషా-హార్దిక్ లకు ఓ బిడ్డ కూడా ఉన్న సంగతి తెలిసిందే. విడిపోయినా సహ తల్లిదండ్రులుగా కొనసాగుతామని ఇరువురు వెల్లడించారు.