పెల్లుబికిన అభిమానం.. కాపాడుకోవాల్సింది పవనే!
తాజాగా రాసిన లేఖ.. ఆ పార్టీపై యువ తకు ఉన్న అభిమానాన్నేకాదు.. పవన్‌పై ఉన్న నమ్మకాన్ని.. పార్టీపై ఉన్నవిశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Jan 2024 4:58 AM GMTజనసేన పార్టీకి కేవలం లోకల్‌గానే కాదు.. విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ. స్థానికంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అభిమానించేవారు.. ఆయనంటే ప్రాణం పెట్టేవారు.. చాలా మంది ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా.. ఆయనంటే ఇష్టపడుతున్నవారు కూడా ఉన్నారు. అందుకే పవన్ ఎక్కడ సభలు పెట్టినా.. ఇసుక వేసినా రాలనంతగా జనాలు క్యూ కడుతున్నారు. దీంతో ఈ అభిమానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్‌పై మరింత పెరుగుతోంది.
తాజాగా ఎక్కడో ఐర్లాండ్ దేశంలో ఉన్న జనసేన అభిమాని ఒకరు తాజాగా రాసిన లేఖ.. ఆ పార్టీపై యువ తకు ఉన్న అభిమానాన్నేకాదు.. పవన్‌పై ఉన్న నమ్మకాన్ని.. పార్టీపై ఉన్నవిశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. పేరు చెప్పకపోయినా.. తనను తాను 'ఓడ కళాసీ'గా పరిచయం చేసుకున్న ఈ అభిమాని.. స్వదస్తూరితో రాసిన లేఖను పవన్‌కు ట్విట్టర్ ద్వారా పంపించారు. దీనికి పవన్ కూడా రిప్లయ్ ఇచ్చారు
లేఖ సారాంశం ఇదీ..
అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు... కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?
సరికొత్త గెరిల్లా వార్ ఫైర్‌ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చక పోతావా?
17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.
2014 - నిలబడ్డాం
2019 - బలపడ్డాం
2024 -బలంగా కలబడదాం!
కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతున్నా... కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్‌వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి.
- ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.
పవన్ రిప్లయ్!
ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పనిచేస్తున్న నా జనసేన అభిమానీ నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు. - అని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే.. ఇంత అభిమానాన్ని.. ఇంత మంది అభిమానులను కాపు కాయాల్సిన వారి అభిమానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పవన్‌పైనే ఉంది.