Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ గల్లా వీడ్కోలు విందు.... ఇక నో పాలిటిక్స్...!

అలాగే ఆయన కుటుంబానికి రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   25 Jan 2024 12:30 AM GMT
టీడీపీ ఎంపీ గల్లా వీడ్కోలు విందు.... ఇక నో పాలిటిక్స్...!
X

తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నారు. ఆయన గుంటూరు నుంచి 2014, 2019లలో రెండు సార్లు వరసగా గెలిచారు. దివంగత నటుడు సూపర్ స్టార్ క్రిష్ణ పెద్దల్లుడు, మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్ కి టీడీపీలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆయన కుటుంబానికి రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.

గల్లా కుటుంబానిది చిత్తూరు జిల్లా.మూడు తరాల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి 1989లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ మీదట 1999, 2004, 2009లలో వరసగా గెలిచారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆమె కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. ఏపీలో కాంగ్రెస్ విభజన తరువాత ఇబ్బందులు పడడంతో ఆమె టీడీపీలో చేరారు. అలా 2014లో ఆమె పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు.

అయితే కుమారుడు జయదేవ్ మాత్రం గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. జయదేవ్ రెండవసారి గెలిచిన తరువాత ఎందుకో రాజకీయంగా దూకుడు తగ్గించేశారు ఆయనకు వ్యాపారాల మీదనే శ్రద్ధ పెరిగింది అని అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన ఇక నో పాలిటిక్స్ అనేస్తున్నారు అంటున్నారు.

గడచిన మూడేళ్ళుగా ఆయన ఎంపీగా కానీ టీడీపీ కార్యక్రమాలలో కానీ ఎక్కడా కనిపించలేదు అని అంటున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9 వరకూ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇవే బీజేపీ రెండవ టెర్మ్ అధికారానికి చివరి సమావేశాలుగా ఉండోబోతున్నాయి. అంతే కాదు చాలా మంది ఎంపీలకు కూడా ఇవే చివరి సెషన్ గా ఉండబోతోంది. అందుకో గల్లా జయదేవ్ ఒకరు అని అంటున్నారు.

ఆయన వైసీపీలో చేరబోతున్నారు అని ఈ మధ్య ప్రచారం జరిగింది కానీ ఆయన రాజకీయాలకే గుడ్ బై కొట్టేస్తున్నారు అన్నది లేటెస్ట్ వార్తగా ఉంది. గల్లా జయదేవి తన పదేళ్ల రాజకీయ జీవితానికి సంబంధించిన వీడ్కోలు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు లో ఈ నెల 28న ఒక ఆత్మీయ విందు కార్యక్రమాన్ని గల్లా జయదేవ్ ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి తనకు రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపించిన కార్యకర్తలు, గుంటూర్ ఎంపీ పరిధిలోని ముఖ్య నాయకులు ఇతర టీడీపీ నేతలను ఆహ్వానించారని అంటున్నారు.

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ తన రాజకీయ జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా చెబుతారు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఆయన చాలా కాలం క్రితమే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అని సమాచారం ఇచ్చారు అని అంటున్నారు. మొత్తం మీద పదేళ్ల పాటు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు అన్నది మాత్రం తాజా వార్తగా ప్రచారంలోకి వస్తోంది.