Begin typing your search above and press return to search.

పంజాబ్ రైతుల తరహాలో యూకేలో... ఇది పీక్స్ గురూ!

ఇటీవల రైతు ఉద్యమ సమయంలో పంజాబ్ రైతుల ట్రాక్టర్లు పొలాలు వదిలి ఢిల్లీ సమీప వీధుల్లో పరుగెత్తిన లాంటి ఘటన తాజాగా గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో చోటు చేసుకుంది. లండన్ నగరంలో ట్రాక్టర్లు హల్ చల్ చేశాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 2:30 PM GMT
పంజాబ్  రైతుల తరహాలో యూకేలో... ఇది పీక్స్  గురూ!
X

దూరపు కొండలు నునుపు అని ఓ సామెత. అభివృద్ధి చెందాయని చెప్పుకునే దేశాల్లో అంతా అద్దాల మేడల తరహాలో ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కాని.. రియాల్టీ కథ వేరుంటుందని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఇటీవల రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఢిల్లీ ముందు పోటెత్తినట్లు.. యూకేలో రైతులు పోటెత్తిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... భారత్ వంటి దేశాల్లో రైతుల నిరసనలు కొనసాగుతుంటాయి.. వారి డిమాండ్లకు కొన్ని సార్లు ప్రభుత్వాలు దిగొస్తుంటాయి. దిగని ప్రభుత్వాలు తర్వాత దిగిపోతుంటాయి! ఈ నేపథ్యంలో ఇటీవల రైతు ఉద్యమ సమయంలో పంజాబ్ రైతుల ట్రాక్టర్లు పొలాలు వదిలి ఢిల్లీ సమీప వీధుల్లో పరుగెత్తిన లాంటి ఘటన తాజాగా గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో చోటు చేసుకుంది. లండన్ నగరంలో ట్రాక్టర్లు హల్ చల్ చేశాయి.

దీనికి బలమైన కారణం ఉంది. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 2026 నుండి ఒక మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ విలువైన.. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ ఆస్తిపై 20 శాతం పన్ను విధించబడుతుంది. అయితే... గతంలో దీనికి పన్ను రహితం ఉండేది. దీంతో... బ్రిటన్ రైతులు మండిపడుతున్నారు. దీంతో.. రైతులు తమ ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు.

ఇందులో భాగంగా... వారసత్వ పన్నులో మార్పులకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కెంట్ నుంచి రైతులు తమ ట్రాక్టర్లతో నేరుగా లండన్ చేరుకుని రాజధానిని ముట్టడించడం ప్రారంభించారు. వందలాది మంది రైతులు తమ ట్రాక్టర్లను బ్రిటిష్ రాజధాని నడిబొడ్డుకు తీసుకెళ్లి తమ నిరసన తెలిపారు.

దీనికి ప్రధాన కారణం.. రైతులు చాలా మంది ఈ కొత్త విధానం వల్ల కుటుంబ పొలాలు నాశనమవుతాయని ఆందోళన చెందుతున్నారు. కుటుంబాలు పన్నులు చెల్లించడానికి తమ భూమిని అమ్ముకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో రైతుల్లో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రజలు ఆన్‌ లైన్‌ లో సంతకం చేసిన పిటిషన్‌ పై పార్లమెంటరీ చర్చతో ఈ నిరసన జరిగిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. రిఫార్మ్ యూకే పార్టీ నాయకుడు నిగెల్ ఫరాజ్ రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అన్ని వారసత్వ పన్నులను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, లేబర్ పార్టీ ఈ విధానాన్ని సమర్థించింది. ప్రజా సేవలను అందించడం కొనసాగించడానికి పన్నులు అవసరమంటూ తన వాదనను వినిపించింది.

కాగా.. రైతే రాజు అని చెప్పుకునే భారత్ సహా... ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, బెల్జియం, గ్రీస్‌ లలోని వ్యవసాయ కార్మికులు ఇలాంటి సామూహిక నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రోడ్లను దిగ్బంధించి తమ నిరసన తెలిపారు. ఏది ఏమైనా.. దేశం మరేదైనా.. రైతు బాగుంటేనే అన్ని బాగుంటానే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.