Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ తనిఖీల కోసం పోలీసులు వెళ్లనున్నారా?

కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ చూస్తే.. నెల క్రితం అనుకున్న దానికి తాజాగా పరిణామాలకు పొంతనే ఉండదన్న భావన కలగటం ఖాయం

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:57 AM GMT
ఫాంహౌస్ తనిఖీల కోసం పోలీసులు వెళ్లనున్నారా?
X

కాలానికి ఉన్న శక్త మరి దేనికి ఉండదనే చెప్పాలి. ఒకరి తప్పుల్ని మర్చిపోయేలా చేసే సత్తా ఉన్న సమయం.. ఒకరి విషయంలో తాము చేసే తప్పుల్ని టైమ్లీగా తెర మీదకు తీసుకొచ్చి ఇరుకున పడేలా చేసే వీలుంది. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మొన్నటివరకు అధికార పక్షంగా వెలిగిపోయిన గులాబీ పార్టీ ఇప్పుడు కళ తప్పిన పరిస్థితి. నెల క్రితం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారన్నంతనే.. గులాబీ పార్టీ అన్న సమాధానం ఎక్కువ మంది నోటి నుంచి వచ్చేది.

కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ చూస్తే.. నెల క్రితం అనుకున్న దానికి తాజాగా పరిణామాలకు పొంతనే ఉండదన్న భావన కలగటం ఖాయం. ఇదే సమయంలో.. రేవంత్ గెలుపు వేళ.. అప్పుడెప్పుడో జరిగిపోయిన పలు పాత వీడియోలు తెర మీదకు వస్తున్నాయి. వాటిల్లోని కొన్ని వీడియోల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటమే కాదు.. సోషల్ మీడియాలో వాదనలకు.. ప్రతివాదనలు పురుడు పోసుకునేలా చేస్తున్నాయి.

ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే డిసెంబరు 4న అర్థరాత్రి సమయంలో కొడంగల్ లోని రేవంత్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించటం.. ఎన్నికల సందర్భంగా డబ్బులు ఉంచారన్న ఆరోపణలపై సోదాలు నిర్వహించటం.. ఆయన్ను అదుపులోకి తీసుకోవటం.. ఈ సందర్భంగా ఆయన బెడ్రూం తలుపుల్ని పగలగొట్టారంటూ ఆరోపిస్తున్న రేవంత్ వీడియోలను.. దానికి సంబంధించిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరో వీడియోలో.. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అరెస్టు చేసి పోలీసు జీపు ఎక్కించే సమయంలో.. సదరు వాహనం పైకి ఎక్కి.. మీసం మెలేసి.. నీ అంతు చూస్తానంటూ భారీ శపధం చేసిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా కొత్త చర్చ మొదలవుతోంది. అందులో ప్రధానమైంది.. రేవంత్ తన పంతాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ఫాంహౌస్ లో తనిఖీలు చేపడతారా? అన్నది ప్రధానమైంది.

నాడు ఇంటి బెడ్రూం తలుపులు బద్ధలు కొట్టించిన దానికి ప్రతిగా.. ఫాంహౌస్ తనిఖీలు చేసి.. అసలు ఫాంహౌస్ ఎలా ఉంటుందన్న విషయాన్ని.. అక్కడి లగ్జరీని రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టేలా చూపిస్తారన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వాదనల వేళ.. కొందరు నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఐదేళ్ల క్రితం చేసిన పని రేవంత్ ను ఈరోజు సీఎంగా చేసిందని.. ఇప్పుడు అదే తప్పును రేవంత్ చేస్తారా? ఒకవేళ చేస్తే.. ఇద్దరికి తేడా ఏముంది అని? మరి.. రేవంత్ దారి ఏదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానాన్ని ఇస్తుందని మాత్రం చెప్పక తప్పదు.