Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ షురూ

ఇంతకూ ఈ విధానం ఎలా పని చేస్తుంది? దీంతో విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి సౌకర్యం ఉంటుందన్న విషయానికి వస్తే..

By:  Tupaki Desk   |   17 Jan 2025 5:27 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ షురూ
X

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు వేగంగా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేందుకు వీలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త వసతిని ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు చెన్నై.. ముంబయి.. కోల్ కతా.. బెంగళూరు.. కొచ్చిన్ ఎయిర్ పోర్టుల్లో ఈ వసతిని షురూ చేశారు.

ఇంతకూ ఈ విధానం ఎలా పని చేస్తుంది? దీంతో విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి సౌకర్యం ఉంటుందన్న విషయానికి వస్తే.. ఇమ్మిగ్రేషన్ కోసం తరచూ ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి తిప్పలు లేకుండా ఉండేందుకు ఈ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ విధానాన్ని వినియోగించుకోవాలంటే విదేశాలకు వెళ్లే ప్రయాణికులు నెల ముందే ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఈ అప్లికేషన్ లో ప్రయాణికులు తమ ఫింగర్ ప్రింట్స్.. ఫోటోను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని అందించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ లోపు క్రాస్ చెక్ చేయటంతో పాటు.. అనుమతి జారీ చేస్తారు. ఈ కొత్త విధానానికి వీలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎనిమిది ఎలక్ట్రానిక్ గేట్లను ఏర్పాటు చేశారు. భారత పాస్ పోర్టు ఉన్నవారు.. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుదారుల కోసం ఈ వసతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.