Begin typing your search above and press return to search.

వయసు 80 ఏళ్లు... ప్రియురాలితో ఏడో బిడ్డకు తండ్రి!

ఈ వయసులో మరోసారి తండ్రి అయ్యాడు! తాజాగా ఈ విషయాన్ని తలచుకుని ఎమోషన్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   28 Jan 2024 11:22 AM GMT
వయసు 80 ఏళ్లు... ప్రియురాలితో ఏడో బిడ్డకు తండ్రి!
X

సాధారణంగా పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో... "ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి" అని అంటుంటారు. అయితే... తాజాగా మనం చెప్పుకోబోయే స్టార్ హీరోకి ఆ సూత్రం వర్తించదు. కారణం... ఆయన ఇటీవల 79ఏళ్ల వయసులో తన ఏడో బిడ్డకు జన్మనిచ్చాడు. ఈ వయసులో మరోసారి తండ్రి అయ్యాడు! తాజాగా ఈ విషయాన్ని తలచుకుని ఎమోషన్ అయ్యాడు.

అవును... రెండుసార్లు ఆస్కార్ విజేత రాబర్ట్ డి నీరో గత ఏడాది మేలో 79 ఏళ్ల వయస్సులో తన ఏడవ బిడ్డకు స్వాగతం పలికారు. అప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన... ప్రస్తుతం ఉన్న ప్రియురాలు టిఫానీ చెన్ తో పేమలో ఉన్నారు. ఆ ప్రేమకు గుర్తుగా అన్నట్లుగా ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చారు. కాగా... అప్పటికే రాబర్ట్ డి నీరోకు ఆరుగురు పిల్లలున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన రాబర్ట్ డి నీరో... తన ఏడవ బిడ్డ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ దిగ్గజ నటుడు రాబర్ట్ డి నీరో 80 ఏళ్ల వయస్సులో ఆనందం, సంతృప్తిని వ్యక్తం చేస్తూ పితృత్వంపై తన మనోభావాలను పంచుకున్నారు. ఇదే సమయంలో... తన భాగస్వామి టిఫనీతో కలిసి నవజాత కుమార్తెకు గియా అని పేరు పెట్టారు!

ఈ సందర్భంగా గియా గురించి మాట్లాడిన దిగ్గజ నటుడు... ఆమెలో గమనించిన ప్రత్యేక లక్షణాలను వివరిస్తూ.. ఆమె తనవరకూ ప్రతిదీ గమనిస్తోంది, ప్రతీ విషయాన్ని చూస్తోంది.. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది.. ఆమెను జీవితంలోకి ఆహ్వానించడం ఒక మధురమైన అనుభూతి అని అన్నారు. ఇదే సమయలో తాను 80 ఏళ్ల తండ్రిని అని గుర్తుచేసుకున్న ఆయన... ఉన్నంతకాలం ఆమె చుటూనే ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో... ఆయన అభిమానులు నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. పితృత్వం తీసుకురాగల గాఢమైన ఆనందం, నెరవేర్పుకు వయస్సు అడ్డంకి కాదని స్పష్టం చేశారంటూ స్పందిస్తున్నారు. కాగా... ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ విజేత అయిన రాబర్ట్... మార్టిన్ స్కోర్సెస్ "కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్"లో అతని సహాయక పాత్రకు ఇటీవల అకాడమీ అవార్డు ప్రతిపాదనను అందుకున్నారు.