Begin typing your search above and press return to search.

ఎఫ్.బీ.ఐ. వాంటెడ్ "రా" మాజీ అధికారి వికాస్ యాదవ్ అరెస్ట్!!

కానీ... యాదవ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడనేది నిన్నటివరకూ వినిపించినమాట! అయితే... పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 8:30 AM GMT
ఎఫ్.బీ.ఐ. వాంటెడ్ రా మాజీ  అధికారి వికాస్  యాదవ్  అరెస్ట్!!
X

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారత్ - కెనడా దౌత్యసంబధాలు ప్తనమవుతున్నాయనే చర్చ బలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికా వ్యాఖ్యలు కాస్త కెనడాకు అనుకూలంగా ఉన్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుని. "రా" మాజీ అధికారి వికాస్ యాదవ్ అరెస్టయారని తెలుస్తోంది.

అవును... సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో.. మాజీ రా అధికారి వికాస్ యాదవ్ తో పాటు అతని సహచరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో గుప్తా యూఎస్ లో కటకటాల వెనుక ఉన్నారు!

కానీ... యాదవ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడనేది నిన్నటివరకూ వినిపించినమాట! అయితే... పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా వికాస్ యాదవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కథనాలొస్తున్నాయి!

కాగా... సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి న్యూయార్క్ లోని కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు అయ్యింది. ఇందులో ఇండియన్ సిటిజన్ అయినా వికాస్ యాదవ్ పై పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం, కుట్రకు వ్యక్తులను నియమించడంతో పాటు మనీల్యాండరింగ్ అభియోగాలు మోపారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక, వికాస్ యాదవ్ గతంలో భారతదేశపు విదేశీ గూడఛార సంస్థ "రా"లో పని చేశారు! ఈ నేపథ్యలో ఆయన పరారీలో ఉన్నారని ఎఫ్.బీ.ఐ. చెబుతున్నవేళ.. ఢిల్లీ పోలీసులు వికాస్ యాదవ్ ని అరెస్ట్ చేశారనే కథనాలు ఇప్పుడు వైరల్ గా మారాయి!